అయోధ్య తీర్పు జాతీయ పార్టీల మౌనం, కారణం ఇదేనా?

అయోధ్యలోని వివాదాస్పద భూ విషయమై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు ముఖ్యులు స్పందించారు.కాని ఇప్పటి వరకు బీజేపీ మరియు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులు మాత్రం మాట్లాడటం లేదు.

 The National Parties Silence In Ayyodhya Rama Mandhir-TeluguStop.com

ఎందుకంటే ఇప్పటి వరకు ఆ పార్టీలు రెండు కూడా తీర్పు విషయంలో ఎలాంటి ఒక నిర్ణయానికి రాలేదు.ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ తమ పార్టీ అధికార ప్రతినిధులకు అసలు టీవీ కార్యక్రమాల చర్చలకు వెళ్లవద్దంటూ ఆదేశించింది.

అయోధ్య తీర్పు విషయమై మాట్లాడవద్దంటూ సూచించింది.పార్టీ అధినాయకత్వం ఈ విషయమై చర్చించి ఎలా స్పందించాలనే విషయంపై ఒక నిర్ణయం తీసుకోనుంది.

బీజేపీ కూడా తమ నాయకులను టీవీ చర్చ కార్యక్రమాల్లో పాల్గొనవద్దంటూ సూచించింది.

టీవీ కార్యక్రమాల్లో ఈ రెండు పార్టీ నాయకులు లేకపోవడంతో వెలవెల బోతున్నాయి.

ఇక ఈ రెండు పార్టీలు కూడా వెంటనే స్పందించకుండా ఉండటం మంచి నిర్ణయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దేశ వ్యాప్తంగా ఈ రెండు పార్టీల కార్యకర్తలు ఉంటారు.

ఈ తీర్పుపై ఎలా స్పందించినా కూడా ఆ పార్టీల కార్యకర్తలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.అందుకే స్పందించకుండా ఉండటం ఉత్తమం అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube