అమెరికాలో సంచలనం సృష్టిస్తున్న హత్యలు...!!!

అమెరికాలో ఒకే కుటుంభంలో జరిగిన ఆరుగురి హత్య స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.సహజంగా హత్యలు జరగడం వెనుక ఏదో ఒక కుట్ర కోణం ఉంటుంది, లేదంటే పగలు ప్రతీకారాల నేపధ్యంలో అయిన హత్యలు జరుగుతాయి.

 The Murders That Are Creating A Sensation In America-TeluguStop.com

కానీ ఒక కుటుంభంలో ఇద్దరు అన్న దమ్ములు వారి కుటుంభ సభ్యులను చంపమని, తమని కూడా చంపమని ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ డెత్ లు మిస్టరీగా మారుతున్నాయి.అసలు ఇలా ఎందుకు చేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఈ కేసును పరిశోధిస్తున్న జోన్ ఫెల్తి తెలిపిన వివరాల ప్రకారం.

 The Murders That Are Creating A Sensation In America-అమెరికాలో సంచలనం సృష్టిస్తున్న హత్యలు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమెరికాలోని డల్లాస్ లో సబర్బన్ లోని ఓ ఇంట్లో ఆరుగురు చనిపోయినట్టుగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దాంతో హుటాహుటిన వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు.హత్యకు కుట్ర ఎలా జరిగి ఉంటుందని భావించిన అధికారులు హత్య జరిగిన తీరును బట్టి కుటుంభంలోని ఇద్దరు సోదరుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించారు.

అందులో ఓ సోదరుడి ఇన్స్టా గ్రామ్ ఖాతాలో తాను, అతడి సోదరుడు, చనిపోనున్నట్టు, అంతకంటే ముందుగా తమ కుటుంభ సభ్యులను చంపడానికి ప్రణాళిక చేస్తున్నట్టుగా తెలిపాడు.

ఈ హత్యలలో హత్య- ఆత్మహత్య కుట్ర రెండు అంశాలు ఉన్నాయని తెలిపారు పోలీసులు.

సోదరులు తన్వీర్, పర్హాన్ లు ఇద్దరు తమను తాము చంపుకుని, కుటుంభాన్ని కూడా చంపడం వెనుక ఎవరు కుట్ర అయినా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.చనిపోయిన వారిలో సోదరుల బామ్మ అల్తాపున్ నెస్సా 77 ఏళ్ళు , తల్లి తండ్రులు ఇరెన్ ఇస్లాం 56 ఏళ్ళు, తల్లి తోహిదుల్ ఇస్లామ్ 54 ఏళ్ళు మరియు సోదరి ఫర్బిన్ 19 ఏళ్ళుగా నిర్ధారించారు పోలీసులు.

వీరి కుటుంభం బంగ్లాదేశ్ నుంచీ వలస వచ్చి డల్లాస్ లో స్థిరపడిందని, ఎంతో సంతోషంగా ఉండే కుటుంభంలో ఇలాంటి ఘటన జరగడంతో షాక్ అయ్యామని చుట్టుపక్కల వారు తెలిపారు.స్థానికంగా ఉండే బంగ్లాదేశ్ కు చెందిన కమ్యూనిటీ ఘటనా స్థలానికి వచ్చారు.

ఎంతో మంచి కుటుంభంలో ఇలాంటి ఘోరం జరుగుతుందని అనుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు.

#Joan Felti #Tanveer #Parhan #Bangladesh

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు