నా ఇమేజ్ కారణంగానే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.. రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్!

యాంగ్రీ మెన్ రాజశేఖర్ మొదటిసారిగా తన భార్య జీవిత దర్శకత్వంలో నటించిన చిత్రం శేఖర్.ఈ సినిమా నేడు (మే 20 ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 The Movie Flop Because Of My Image Rajasekhar Shocking Comments , Rajasekhar, To-TeluguStop.com

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రాజశేఖర్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే ఈయన రీమేక్ సినిమాల గురించి మాట్లాడారు.

రీమేక్ సినిమాలు చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, ముందుగానే హీరో హీరోయిన్ల పాత్ర ఎలా ఉండబోతుందో తెలుస్తుందని రాజశేఖర్ వెల్లడించారు.

ఇలా రీమేక్ సినిమాలో హీరో హీరోయిన్ల పాత్రలు గురించి తెలియడం వల్ల వారు మరింత మంచిగా నటించే అవకాశం ఉంటుందని ఈయన తెలిపారు.

అయితే కొన్నిసార్లు రీమేక్ చిత్రాలు విజయం సాధించవచ్చు మరికొన్నిసార్లు అపజయం కావచ్చు. సినిమా హిట్ అవ్వడం, ఫ్లాప్ అవ్వడం అనేది ప్రేక్షకుల చేతిలో ఉంటుందని రాజశేఖర్ తెలిపారు.

ఈ క్రమంలోనే ఒక రీమేక్ సినిమా ఒక భాషలో హిట్ అయ్యి మరొక భాషలో ఫ్లాప్ కావడానికి కూడా కారణాలను వెల్లడించారు.

ఒక సినిమాని రీమేక్ చేస్తున్నప్పుడు ఆ భాషకు అనుగుణంగా కొన్ని సార్లు సినిమాలో మార్పులు చేయాల్సి ఉంటుంది.

మరికొన్నిసార్లు ఎలాంటి మార్పులు లేకుండా సినిమాని తెరకెక్కిస్తారు.ఈ క్రమంలోనే తాను నటించిన శేషు సినిమా గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

తెలుగులో రాజశేఖర్ నటించిన శేషు సినిమా తమిళ రీమేక్ సినిమా అని వెల్లడించారు.తమిళంలో ఈ సినిమాలో విక్రమ్ నటించి మంచి విజయాన్ని అందుకున్నారు.

అయితే ఆ సమయంలో విక్రమ్ కి పెద్దగా స్టార్డం లేకపోవడం వల్ల ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Telugu Rajasekhar, Telugu, Tollywood-Movie

శేషు తమిళ సినిమాలో ఎలాంటి మార్పులు చేయకుండా దానిని తెలుగులోకి రీమేక్ చేసాము.అయితే ఆ సమయంలో తెలుగులో నాకు ఉన్న పాపులారిటీ కారణంగా ఆ సినిమాకి ప్రేక్షకులు విజయం అందించలేకపోయారు.నాకున్న ఇమేజ్ కారణంగా ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో కొన్ని మార్పులు చేసి ఉంటే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకునేదని,కేవలం నా ఇమేజ్ కారణంగా ఈ సినిమాలో ఎలాంటి మార్పులు చేయకపోవడం వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయిందని ఈ సందర్భంగా రాజశేఖర్ రీమేక్ చిత్రాల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube