400 ఏళ్ల మర్రిచెట్టుకోసం ఉద్యమం... చివరకు..?!

ప్రపంచంలో రోజురోజుకి నాగరికత పెరుగుతున్న నేపథ్యంలో మధ్యలో ఏమైనా అడ్డంకులు వస్తే వాటిని పక్కకు తోస్తూ ముందుకు సాగుతున్నారు.అభివృద్ధి నేపథ్యంలో దేశంలో అనేక చోట్ల రోడ్లు, భవన నిర్మాణాలు కొనసాగిస్తున్నారు.

 Marri Chettu , Minister, Maharashtra, Villagers Strike For Banyan Tree In Mahara-TeluguStop.com

ఇలాంటి నిర్మాణ కార్యక్రమాల్లో ఒక్కోసారి పెద్ద పెద్ద చెట్లను నరికి వేయాల్సిన పరిస్థితి వస్తుంది.అయితే తాజాగా రోడ్డుకు అడ్డంగా ఉందని ఏకంగా 400 సంవత్సరానికి పురాతన మర్రి చెట్టును నరికి వేయడానికి అధికారులు ప్రయత్నించగా ఇంతలో ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.

ఈ సందర్భంగా వెంటనే ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని ఆ చెట్టుని కూల్చకుండా కాపాడారు.ఒక అసలు విషయంలోకి వెళితే… ఈ సంఘటన మహారాష్ట్రలోని సాంగ్లీ లోని బోస్ గ్రామంలో జరిగింది.

వారి ఊరి చివర్లో ఉన్న నాలుగు వందల సంవత్సరాల నాటి మర్రిచెట్టు నరికి వేయకుండా ఆ గ్రామస్తులు కాపాడుకున్నారు.అయితే ఆ గ్రామం వెంబడి రహదారి నిర్మాణం కోసం రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని భావించిన అధికారులకు నాలుగు వందల సంవత్సరాల కిందటి పురాతనమైన మర్రిచెట్టు అడ్డుతగిలింది.

దీంతో దాన్ని తొలగించాలని అధికారులు నిర్ణయించుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే ఆ చెట్టు చుట్టూ చేరి నిలబడి ఉద్యమాన్ని ప్రారంభించారు.చెట్టును ఎలాగైనా సరే నరక వద్దని నినాదాలు చేశారు.
ఈ విషయం రాజకీయ పెద్దలకు తెలియడంతో ఆ విషయాన్ని కాస్త కేంద్ర రహదారి రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి తెలుపగా, దాంతో ఆ రోడ్డు నిర్మాణం కాస్త ఆ చెట్టు నుండి 15 మీటర్ల పక్కనుండి చేయాలని అధికారులకు సూచించారు.

నిజానికి ఈ చెట్టు 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.అయితే అక్కడ ఉన్న ప్రజలకు ఆ చెట్టు సనాతన సాంప్రదాయాలతో ముడిపడి ఉంది.అందుకు కాబట్టే మర్రి చెట్టు కోసం పెద్ద ఎత్తున గ్రామస్తులు ఉద్యమం బాట పట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube