శభాష్ ఎలుక... గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన మూషికం...!

కంబోడియా దేశంలో చిట్టెలుక అత్యంత గౌరవానికి అర్హత సంపాదించింది.అంతేకాదు అరుదైన గౌరవాన్ని కూడా అందిపుచ్చుకుంది.

 Rat, Gold Medal, Belgium, Land Mines, Officers, Training-TeluguStop.com

అంతే కాదు ఈ సందర్భంగా గోల్డ్ మెడల్ ను సాధించింది.ఇక ఈ పథకం పేరు చూస్తే పిడిఎస్ఏ గోల్డ్ మెడల్.

అయితే ఈ మెడల్ ఇంతవరకు 30 జంతువులకు ఇచ్చారు.అయితే మొట్టమొదటిసారిగా ఎలుక ఈ అవార్డును గెలుచుకుంది.

ఎలుక జాతిలోనే ఈ ఎలక ఓ ఆణిముత్యంలా నిలిచి చరిత్ర సృష్టించిందని నెటిజన్ కామెంట్ చేస్తున్నారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

ఆ ఎలుక పేరు ‘మగావా’.

ఇంతకూ ఈ మెడల్ ను ఆ ఎలుక ఎందుకు బహుకరించారో అని ఇప్పటికే మీకు ఓ డౌట్ వచ్చి ఉంటుంది.అసలు ఈ ఎలుకకు ఈ బంగారు పతకం ఎందుకు ఇచ్చారంటే ఎలుక పోలీస్ జాగిలాల వలె అక్కడ పని చేస్తోంది.

ఆఫ్రికా ప్రాంతానికి చెందిన ఈ ఎలుక కాంబోడియా భూముల్లో పాతిపెట్టిన ల్యాండ్ మైండ్ ను కనిపెట్టడంలో ఈ ఎలుక ఎంతగానో ప్రతిభ చూపించింది.అది ఎంతలా అంటే గత ఏడు సంవత్సరాల్లో ఈ ఎలుక వల్ల ఏకంగా 39 ల్యాండ్ మైండ్స్, అలాగే 28 పేలుడు పదార్థాలను అధికారులు కనిపెట్టారు.

దీంతో మనుషుల ప్రాణాలను కాపాడటంలో ఎంతో ప్రముఖ పాత్ర వహించిన ఈ మగావా కు ఈ అరుదైన గౌరవం లభించింది.అయితే ఈ ఎలుకకు బెల్జియం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ల్యాండ్ మైన్ ఎలా కనిపెట్టాలి అన్న విషయంపై అధికారులు ట్రైనింగ్ ఇచ్చారు.

ఈ ఎలుక ట్రైనింగ్ లో జాయిన్ అయినప్పుడు నుంచి చాలా చురుగ్గా ఉందని, అలా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత డ్యూటీలో జాయిన్ అయి చివరికి ఇలా గోల్డ్ మెడల్ ని కూడా సాధించిందని అధికారులు తెలియజేశారు.ప్రస్తుతం ఈ ఎలుక వయస్సు ఏడు సంవత్సరాలు.

ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి కారకురాలైన ఈ ఎలుక సేవలను గుర్తించిన ప్రభుత్వం చివరకు బంగారు పథకంతో అభినందించారు.ఇకపోతే 1990 సంవత్సరం నుండి బెల్జియం దేశానికి చెందిన అపోపో సంస్థ ఎలుకలకు ట్రైన్ చేస్తూ వస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube