ఎయిర్‌పోర్టులో వెయిట్ చేస్తున్న కొడుకును చెప్పుతో కొట్టిన త‌ల్లి.. ఎందుకంటే..?

The Mother Who Slapped Her Son Who Was Waiting At The Airport Because

త‌ల్లి ప్రేమను ఎలా చూపించినా అది బిడ్డ బాగు కోస‌మే.ఎందుకంటే ఈ భూమ్మీద త‌ల్లికంటే అమితంగా ప్రేమించే వాళ్లు ఎవ‌రూ ఉండ‌రు.

 The Mother Who Slapped Her Son Who Was Waiting At The Airport Because-TeluguStop.com

ఇది జ‌గ‌మెరిగిన స‌త్యం.త‌ల్లి కోప్ప‌డినా అందులో చాలా అర్థం ఉంటుంది.

ఏది చేసినా బిడ్డ బాగుండాల‌నే చేస్తుంది ఏ త‌ల్లి అయినా.ఈ విష‌యంలో ఎవ్వ‌రైనా ఒకే విధంగా ఉంటారు.

 The Mother Who Slapped Her Son Who Was Waiting At The Airport Because-ఎయిర్‌పోర్టులో వెయిట్ చేస్తున్న కొడుకును చెప్పుతో కొట్టిన త‌ల్లి.. ఎందుకంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్ప‌టికే మ‌నం త‌ల్లి ప్రేమ‌కు సంబంధించిన వీడియోలు అనేకం చూస్తున్నాం.ఇప్పుడు కూడా ఇలాగే ఓ త‌ల్లి ప్రేమ‌కు సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట్లో తెగ చెక‌ర్లు కొడుతోంది.

అయితే ఇది కొంచెం డిఫ‌రెంట్ గా ఉంది.

సాధార‌ణంగా మ‌న బంధువులు, లేదా కుటుంబీకులు విదేశాల నుంచి వ‌స్తున్నారంటే ఎయిర్ పోర్టుకు వెళ్లి రిసీవ్ చేసుకోవ‌డం చాలా కామన్.

ఇక వారిని చాలా రోజుల త‌ర్వాత చూస్తే మాత్రం ఆ భావోద్వేగం అంతా ఇంతా కాదు.ఇక‌పోతే ఇప్పుడు కూడా ఓ త‌ల్లి కోసం కొడుకు ఇలాగే ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు.

చాలా రోజుల నుంచి త‌ల్లి దూరంగా ఉండ‌టంతో ఆమెను రిసీవ్ చేసుకునేందుకు ఎంతో ఆతృత‌గా ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు.చేతిలో బొకే ప‌ట్టుకుని ఒక ప్ల‌కార్డుతో త‌ల్లి కోసం ఎదురు చూస్తున్నాడు.

అయితే ఇంత‌లోనే ఆ త‌ల్లి బ‌య‌ట‌కు వ‌స్తుంది.

అయితే అంద‌రూ ఊహించ‌న‌ట్టు కొడుకును ప్రేమ‌తో ద‌గ్గ‌ర‌కు తీసుకోకుండా చెప్పు తీసుకుని కొడుతుంది.

త‌న కొడుకును ఇలా కొట్టేయ‌డంతో అంతా షాక్ అయిపోతారు.ఇక ఆ కొడుకు కూడా న‌వ్వుకుంటూనే దెబ్బ‌లు ప‌డ‌తాడు.

కానీ ఇలా కొట్టిన త‌ర్వాత ఆ త‌ల్లి కొడుకును ప్రేమ‌తో హ‌త్తుకోవ‌డం కూడా క‌నిపిస్తుంది.ఈ ఘ‌ట‌న అంతా పాకిస్తాన్ లో చోటు చేసుకుంది.

అన్వర్‌ జలాని అనే వ్య‌క్తిని ఇలా త‌న త‌ల్లి కొట్టింది.దీన్ని చూసిన వారంతా నీకు త‌ల్లి ఆశీర్వాదం చాలా గ‌ట్టిగానే ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇంకొంద‌రేమో ఆ త‌ల్లి నిన్ను ఎంత‌గానో మిస్ అయ్యింది .అందుకే ఇలా కోపానికి వ‌చ్చిందంటూ చెబుతున్నారు.

#MotherSlapped #Mother Love

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube