1400 మంది అనాథలను దత్తత తీసుకొని , వారి కోసం వీధుల్లో బిక్షాటన ఆమె గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే...

మన దేశం లో ఎంతో మంది అనాథలు ఉన్నారు .వారిని దత్తత తీసుకోవడానికి కొంత మంది మనసున్న మంచి మనుసులు ముందుకు వస్తున్నారు , కానీ వారు కూడా ఎంతమందిని అని దత్తత తీసుకుంటారు .

 The Mother Of Thousands Of Orphans Story Of Sindhutai Sapkal-TeluguStop.com

కొందరు సంతానం కలగకుంటే ఒకటి లేదా ఇద్దరు పిల్లలని దత్తత తీసుకుంటారు .అలాంటిది ఒక మాతృ మూర్తి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 1400 కు పైగా పిల్లలను దత్తత తీసుకుంది .ఆమె గురించి మనకి ఎక్కువగా తెలియకపోవచ్చు కానీ మహారాష్ట్ర ప్రజలలో ఆమె తెలియని వారు ఉండరు .తన పేరే సింధుతాయి సప్కల్ ఆమె గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే.

1400 మంది అనాథలను దత్తత తీసుకొని

సింధుతాయి గారు 14 నవంబర్ 1948వ సంవత్సరంలో వర్ధ జిల్లా పింప్రి గ్రామంలో జన్మించారు.సింధుతాయి గారిది బీద కుటుంబం , అందుకే ఆడ పిల్ల అని తెలిసాక ఆమె పుట్టకపోయి ఉంటె బాగుండు అని కుటుంబ సభ్యులు అనుకున్నారు , ఇంట్లో వాళ్ళు కూడా ఆమెను అలాగే చూసేవారు.కానీ సింధుతాయి గారి తండ్రి మాత్రం ఆమెని ఎంతగానో ప్రేమించేవాడు ,ధైర్యం చేసి చదువుకోవడం కోసం పాఠశాలకు కూడా పంపాడు.కానీ సింధుతాయి పదేళ్ళ వయస్సు ఉండగా వార్ధా జిల్లాలోని నవార్గావ్ గ్రామానికి చెందిన శ్రీహరి సప్కల్ అలియాస్ హర్బాజీని వివాహం చేసుకున్నారు .తన 20 ఏళ్ళ వయసులో ముగ్గురు కొడుకులకు తల్లి అయ్యింది.అత్తగారి గ్రామంలో పెద్ద మనుషులు చేస్తున్న దురాక్రమణలను ఎదిరించింది.

దీనితో ఆ సమస్య జిల్లా కలెక్టర్ వరకు చేరింది.గ్రామానికి వచ్చిన కలెక్టర్, సింధుతాయి ఆరోపిస్తున్న అంశంలో నిజం ఉందని గ్రహించి ఆ గ్రామ పెద్దలను మందలించాడు.

దీనితో ఒక పేద గృహిణి వల్ల గ్రామస్తుల ముందు అవమానపడ్డామని ఆ గ్రామ పెద్దలు సింధుతాయి మీద పగ పెంచుకున్నారు.

1400 మంది అనాథలను దత్తత తీసుకొని

ఎలాగైనా ఆమెను ఊళ్ళో లేకుండా చేయాలనీ నిశ్చయించుకొని ఆమె భర్తను ప్రలోభపెట్టారు.దీనితో తొమ్మిదినెలల గర్భంతో ఉన్న సింధుతాయి అత్తవారింట్లో నుండి పారిపోవాల్సి వచ్చింది.అలా వెళ్తూ వెళ్తూ ఒక పశువుల పాకలో తనకు తానుగా పురుడుపోసుకుంది.

ఈసారి ఆడపిల్లకు జన్మనిచ్చింది.ఆ పసిపాపను తీసుకొని కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ స్వగ్రామం పింప్రి వెళ్ళింది.

కానీ ఆమెను చేరదీయడానికి ఆమె తల్లి ఒప్పుకోలేదు.ఎంతైనా ఇష్టం లేని సంతానం కదా తేలిగ్గా బయటికి నెట్టేసింది.

దీనితో సింధుతాయికి రైల్వేస్టేషనే దిక్కయింది.కొన్నిరోజుల పాపను తీసుకొని రైల్వే‌స్టేషన్‌లో బిక్షాటన మొదలు పెట్టింది.

అప్పుడు ఆమె లానే బిక్షాటన చేస్తూ ఆకలితో అలమటిస్తున్న కొందరు పిల్లలు దర్శనమిచ్చారు, అప్పుడే ఆమె నిర్ణయించుకుంది, తన జీవితాన్ని అనాథలకోసం అంకితం చేయాలనీ.ఎంతలా అంటే అనాథలను చేరదీస్తున్న సమయంలో తన కన్నకూతురు వెంట ఉంటే పెంపకంలో వ్యత్యాసం చూపుతానేమో అనే అనుమానంతో తన కూతురుని ఒక స్వచ్చంద సంస్థకు ఇచ్చేసింది.

1400 మంది అనాథలను దత్తత తీసుకొని

సింధూతాయి ఇప్పటి వరకు 1400 పైగా అనాథలను చేరదీసింది.అందుకే మహారాష్ట్రలో ఆమెని మాయి ( అమ్మ ) అని అంటారు.ఇప్పుడు ఆమె కుటుంబం చాలా పెద్దది .ఆమెకి 207 మంది అల్లుళ్ళు , 36 మంది కోడళ్లు , 1000 కి పైగా మనవాళ్ళు ఉన్నారు.ఇప్పటి వరకు ఆమె చేసిన సేవ కు గాను 300 కి పైగా పురస్కారాలు అందుకుంది.ఆమెని చిన్నతనం లొనే వదిలేసిన భర్త సింధూతాయి దగ్గర క్షమాపణలు అడగడానికి తన 80 ఏళ్ళ వయసు లో వస్తే ఆయనను ఆమె క్షమించి అతడిని కూడా తన సొంత బిడ్డల గా దత్తత తీసుకుంది.

ఎవరైనా ఆమె ఉంటున్న ఆశ్రమానికి వస్తే అతడిని పెద్ద కొడుకు గా పరిచయం చేస్తుంది.సింధూతాయి గారి పైన 2010 లో మరాఠీ భాషలో మీ సింధూతాయి సప్కల్ అనే పేరుతో బయోపిక్ వచ్చింది.

ఆ సినిమా 54 వ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రీమియర్ కి ఎంపిక అయింది.ఇంట్లో వాళ్ళు బయటకి గెంటేస్తే అనాథల మారిన సింధూతాయి ఎంతో మంది అనాథ పిల్లల జీవితాలలో వెలుగు నింపింది.

ఆమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తుంది…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube