ఇటీవలే కాలంలో ప్రేమించిన వారి కోసం కుటుంబ సభ్యులపైనే దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు మూర్ఖులు.కేవలం ప్రేమించిన వారి కోసం కుటుంబ సభ్యులను దారుణంగా హత్యలు చేస్తున్నారంటే ప్రపంచంలో ఇంతకంటే మరొక ఘోరం ఉండదేమో.
ఓ మైనర్ బాలిక ( minor girl )తన ప్రేమకు తల్లి అడ్డు చెప్పిందని ఏకంగా ప్రియుడుతో కలిసి దారుణమైన హత్యకు పాల్పడింది.ఆ వివరాలు ఏమిటో చూద్దాం.
ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా భావ్న ఆరోమా ప్రాంతంలో ఉదిత్ బజాజ్( Udit Bajaj ), అంజలి బజాజ్ అనే దంపతులు నివాసం ఉంటున్నారు.వీరికి ఒక కుమార్తె సంతానం.
ఉదిత్ బజాజ్ ఫుట్ వేర్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.అయితే బుధవారం అంజలి బజాజ్ మహాదేవ్ ( Anjali Bajaj Mahadev )ఆలయానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు.
ఉదిత్ బజాజ్ బుధవారం అర్ధరాత్రి వరకు ఎదురు చూసి స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

పోలీసులు కేసు నమోదు చేసి గురువారం సాయంత్రం మహాదేవ్ ఆలయ సమీపంలో అంజలి బజాజ్ మృతుదేహాన్ని గుర్తించారు.ఈ హత్య చేసింది తమ కూతురి ప్రియుడే అని ఉదిత్ బజాజ్ పోలీసులకు తెలిపాడు.ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.
అసలు జరిగింది ఏమిటంటే.అంజలి కూతురు ఒక మైనర్.
తనకంటే వయసులో పెద్దవాడైన వ్యక్తిని ప్రేమించింది.ఈ విషయం అంజలికి తెలిసి కూతురిని పలుమార్లు మందలించింది.
అంతేకాదు అంజలి తన కూతురిపై పూర్తి నిఘా పెట్టింది.దీంతో ఆ మైనర్ బాలిక ప్రియుడు ప్రాకర్ గుప్త అంజలిపై పగను పెంచుకున్నాడు.

అంజలి ను హత్య చేసేందుకు మైనర్ బాలికతో కలిసి మాస్టర్ ప్లాన్ రచించాడు.ముందుగా అంజలి కూతురు వాట్సప్ ద్వారా తన తల్లికి ఫోన్ చేసి మహాదేవ్ ఆలయానికి రమ్మని పిలిచింది.దీంతో ఉదిత్, అంజలి కలిసి మహాదేవ్ ఆలయానికి వెళ్లారు.ఆ తరువాత ఆ మైనర్ బాలిక తాను గురూస్ పూల్ వద్ద ఉన్నానని, తనను ఇంటికి తీసుకెళ్లాలని ఉదిత్ కు మెసేజ్ పంపించింది.
దీంతో ఉదిత్, అంజలిను ఆలయం వద్ద వదిలి గురూస్ పూల్ కి వెళ్ళాడు.ఇంతలో తాను ఇంటికి చేరుకున్నట్లు ఆ మైనర్ బాలిక తండ్రికి ఫోన్ చేసి చెప్పింది.
అప్పటినుండి భార్య అంజలి కనిపించకుండా పోయింది.పోలీసులు హత్య కేసు నమోదు చేసి మైనర్ బాలికతో పాటు ఆమె ప్రియుడు ప్రాకర్ గుప్త పై కేసు నమోదు చేశారు.
ఈ హత్యకు ప్రాకర్ స్నేహితులకు కూడా సహాయం చేశారని తేలింది.ప్రస్తుతం పోలీసులు పరారీ లో ఉన్న నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు.
