బిడ్డ కోసం మొస‌లిని తొక్కి చంపేసిన త‌ల్లి ఏనుగు..

The Mother Elephant Who Trampled The Crocodile For The Baby

సృష్టిలో అన్నిటిక‌న్నా గొప్ప‌ది తల్లి ప్రేమ‌. ఇది మ‌నుషుల‌కే సృష్టిలోని అన్ని జీవ జాతుల‌కూ వర్తిస్తుంది.

 The Mother Elephant Who Trampled The Crocodile For The Baby-TeluguStop.com

త‌న‌ని ఏమైనా ప‌ట్టించుకోని త‌ల్లి, త‌న బిడ్డ‌ల జోలికి వ‌స్తే మాత్రం ఊరుకోదు.ఉగ్ర రూపం దాల్చుతుంది.

అప్ప‌టి దాకా మాములుగా ఉన్న వ్య‌క్తి లేదా జీవి ఒక్క‌సారిగా కోప్రోదిక్త‌మ‌వుతుంది.బిడ్డ ప్ర‌మాదంలో చిక్కుకుందంటే అస్స‌లు ఊరుకోదు.

 The Mother Elephant Who Trampled The Crocodile For The Baby-బిడ్డ కోసం మొస‌లిని తొక్కి చంపేసిన త‌ల్లి ఏనుగు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇవ‌న్నీ జంతువుల‌కు కూడా వ‌ర్తిస్తాయి.జంతువులు కూడా త‌మ బిడ్డ‌ల‌ను ఇలానే చూసుకుంటాయి.

పిల్ల‌లు ప్ర‌మాదంలో చిక్కుకుంటే కాపాడేందుకు విశ్వ ప్రయ‌త్నాలు చేస్తాయి.అవ‌స‌ర‌మైతే త‌మ ప్రాణాల‌ను కూడా లెక్క చేయ‌వు.

ఇలాంటి ఘ‌ట‌నే ఓ చోట జ‌రిగింది.

ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

జాంబియా స‌ఫారీ అనే ప్రాంతంలో ఏనుగులు గుంపు ఉంటుంది.ఆ ప్రాంతంలో ఉండే ఆకుల‌ను, చెట్ల కొమ్మల‌ను తిన‌డం అక్క‌డే ఉండే కొల‌నులో వాటి దాహం తీర్చుకోవ‌డం ఆ ఏనుగుల దిన‌చ‌ర్య‌.

అయితే ఆ కొల‌నులో ఓ మొస‌లి నివసిస్తోంది.ఆ కొల‌ను ద‌గ్గ‌రికి వ‌చ్చే జంతువుల‌పై అదును చూసి దాడి చేసి బుర‌ద‌లోకి లాక్కెల్లి వాటిని చంపి తినడం దానికి అల‌వాటు.

అలాగే నీరు తాగేందుకు వ‌చ్చిన ఓ గున్న ఏనుగుల గుంపులో నుంచి ఓ చిన్న ఏనుగును మొస‌లి బుర‌ద‌లోకి తీసుకెళ్లాల‌ని ప్ర‌య‌త్నించింది.కానీ ఆ గున్న ఏనుగు పిల్ల తృటిలో త‌ప్పించుకుంది.అయితే దీనిని గ‌మ‌నించిన త‌ల్లి ఏనుగు బుర‌ద‌లోకి దిగి మొస‌లితో త‌ల‌ప‌డింది.ఈ హోరులో ఏనుగు గెలిచింది.మొస‌లి చ‌నిపోయింది.ఓ వ్య‌క్తి దీనిని వీడియో తీసి నెట్ లో అప్ లోడ్ చేయ‌డంతో ఇప్పుడు హ‌ల్‌చ‌ల్‌గా మారింది.

త‌ల్లి ప్రేమ ముందు అన్నీ ఓడిపోవాల్సిందే అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

#Animals #Baby Elephant #Mother Elephant #Mothers Love #Crocodile

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube