ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్... కేవలం 43మంది దగ్గర మాత్రమే..

మీకు తెలిసిన బ్లడ్ గ్రూప్స్ ఏంటి ఎ,బి,ఎబి,ఒ బ్లడ్ గ్రూప్స్ అని టక్కున చెప్పేస్తాం.కాని మనకు తెలియని మరొక బ్లడ్ గ్రూప్ ఉందని తెలుసా… హా తెలుసు గోపిచంద్ సినిమాలో చూసాం ముంబయి బ్లడ్ గ్రూప్ అని అని అంటే మాత్రం మీరు తప్పులో కాలేసినట్టే… మనకు తెలిసిన నాలుగు బ్లడ్ గ్రూప్స్ కాకుండా రీసన్ నెగిటివ్ అనే మరో బ్లడ్ గ్రూప్ ఉంది.

 The Most Precious Blood On Earth-TeluguStop.com

ఆ బ్లడ్ గ్రూప్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు…

ఒక వ్యక్తి శరీరంలోని యాంటీజెన్ కౌంట్ ఆధారంగా వారి బ్లడ్ గ్రూప్‌ను తెలుసుకోవచ్చు.అయితే ఎవరి శరీరంలోనైనా యాంటీజెన్ తక్కువ మోతాదులో ఉంటే వారి బ్లడ్ గ్రూప్‌ను రేర్ గ్రూప్‌గా పరిగణిస్తారు.

యాంటీజెన్ అనేది శరీరంలోని యాంటీబాడీలో తయారవుతుంది.అది శరీరాన్ని వైరస్, బ్యాక్టీరియాల నుంచి కాపాడుతుంది.

రీసన్ బ్లడ్ (RH Null) గ్రూప్ ప్రపంచంలో కేవలం 43 మంది దగ్గరమాత్రమే ఉంది.దీనిని గోల్డెన్ బ్లడ్ అని కూడా పిలుస్తారు.

ఎవరి దగ్గరైతే రీసస్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుందో వారు తమ బ్లడ్ దానంచేసి ఇతరుల ప్రాణాలు కాపాడగలుగుతారు.

గడచిన 52 సంవత్సరాల్లో కేవలం 43 మంది దగ్గర మాత్రమే ఇటువంటి బ్లడ్ గ్రూప్ ఉన్నట్టు వెల్లడైంది.

రీసస్ నెగిటివ్ బ్లడ్ కలిగినవారు ప్రపంచంలో ఎవరికైనా సరే రక్తదానం చేయగలుగుతారు.

ఈ అరుదైన్ బ్లడ్ గ్రూప్ కలిగినవారు సాధారణ మనుషుల్లానే ఉంటారు.

అయితే వీరు తమపై తాము మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.ఎందుకంటే వీరికి బ్లడ్ గ్రూప్ డోనర్ దొరకడం చాలా కష్టం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube