ప్రపంచంలోనే ఖరీదైన సబ్బు.. వెల ఎంతంటే..?

సాధారణంగా సబ్బు ధర ఎంత ఉంటుందంటే 10 రూపాయల నుంచి 50 రూపాయల మధ్య ఉంటుందని ఎవరైనా చెబుతారు.కొంచెం ఖరీదైన సబ్బులైతే వందల్లో ఉంటాయి.అయితే ఒక సబ్బు ధర మాత్రం ఏకంగా 2.07 లక్షల రూపాయలు.ఈ సబ్బు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బు కావడం గమనార్హం.సౌదీ అరేబియా దేశానికి చెందిన డేర్‌ హసన్‌ అండ్‌ సన్స్ సంస్థ ఈ సబ్బును తయారు చేసింది.

 The Most Costliest Soap In The World , 2.07 Lakh Rupees, Dubai, Soudi Arabia, Th-TeluguStop.com

బంగారం, వజ్రాలతో తయారు చేసిన ఈ సబ్బుకోసం ప్రత్యేకమైన ఇన్ గ్రీడియంట్లను ఉపయోగించారు.ఈ సబ్బుకు ఉన్న స్పెషాలిటీస్ ఈ సబ్బు యొక్క విలువ పెరగడానికి పరోక్షంగా కారణమయ్యాయి.

అయితే ఇంత ఖరీదైన ఈ సబ్బును పరిమితంగా మాత్రమే తయారు చేస్తామని.ఖరీదు ఎక్కువ కావడంతో ఎక్కువమంది ఈ సబ్బును కొనుగోలు చేయరని ఆరు శతాబ్దాల నుంచి ఈ వ్యాపారంలో ఉన్నామని లెబనాన్‌లోని ట్రిపోలీకి చెందిన కుటుంబం చెబుతోంది.

ఈ ఖరీదైన సబ్బు తయారీలో వజ్రాల పొడితో పాటు 17 గ్రాముల బంగారాన్ని వినియోగించామని ఖర్జూరం, సహజమైన తేనె, ఆలివ్ నూనె, ఇతర పదార్థాలు ఉపయోగించి తయారు చేసినట్టు ఈ సబ్బును తయారు చేసిన కుటుంబం తెలిపింది.అయితే ఈ ఖరీదైన సబ్బును ట్రిపోలీకి చెందిన కుటుంబం కొందరు ప్రముఖులకు బహుమతిగా ఇచ్చింది.

దీంతో ఈ సబ్బుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఎవరైనా ఈ సబ్బు కొనుగోలు చేయాలనిపిస్తే 2.07 లక్షల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేయవచ్చు.ఇంత ఖరీదైన ఈ సోప్ హ్యాండ్ మేడ్ సోప్ కావడం గమనార్హం.

సాధారణ సబ్బులతో పోల్చి చూస్తే ఈ సబ్బు ఆకారం కూడా విచిత్రంగా ఉండటం గమనార్హం.నెటిజన్లు ఈ సబ్బు ధర తెలిసి ఇంత ఖరీదైన సబ్బును తాము జీవితంలో కొనలేమని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube