చిరుత‌ను ముప్పుతిప్ప‌లు పెట్టిన కోతి.. తెలివితో ప్రాణాలు కాపాడుకుంది..!

అడ‌విలో చిరుత వేగానికి హ‌ద్దులే లేవు.అది వేట‌కు రెడీ అయిందంటే చాలు అవ‌త‌ల ఉన్న‌ది ఏ జంతువైనా దానికి ఆహారం కావాల్సిందే.

 The Monkey Who Threatened The Leopard Intelligently Saved The Lives-TeluguStop.com

ఎంత స్పీడ్‌గా ప‌రుగెత్తినా చిరుత నుంచి త‌ప్పించుకోవ‌డం అంటే య‌మ‌పాశం నుంచి త‌ప్పించుకోవ‌డ‌మ‌న్న‌మాటే.అంత‌లా చిరుత అడ‌విలో వేట సాగిస్తుంది.

అయితే ప్ర‌తిసారి బ‌ల‌మే గెల‌వ‌దు.తెలివి ఉంటే ఆ బ‌లాన్ని కూడా ప‌డ‌గొట్ట‌చ్చు అనే సామెత ఇందుకే పుట్టిందేమో.

 The Monkey Who Threatened The Leopard Intelligently Saved The Lives-చిరుత‌ను ముప్పుతిప్ప‌లు పెట్టిన కోతి.. తెలివితో ప్రాణాలు కాపాడుకుంది..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే ప్ర‌తి సారి బ‌ల‌మే గెలిస్తే మ‌జా ఏముంటుంది చెప్పండి.అందుకే ఈ సారి తెలివి బ‌లాన్ని ఓడించింది.

ఇక అడవిలో అల్లరి చేయ‌డంలో కోతిని మించిన జంతువే లేదు.అది పెద్ద, పెద్ద క్రూర జంతువులకు కూడా మస్కా కొట్టే తెలివిని సంపాదించింది.ఇక కోతి చిరుత‌కు సంబందించిన ఓ ఆసక్తికర వీడియోను ఇప్పుడు మీ ముందుకు మేము తీసుకొచ్చాం.ఓ కోతి సాధార‌ణంగా పెద్ద చెట్టు ఎక్కి చిటారుకొమ్మన కూర్చుంది.

ఇక ఎలా కనిపెట్టిందో ఏమో గానీ కోతిని వేటాడేందుకు ఓ చిరుత అమాంతం చెట్టు ఎక్కింది.ఇక దాని నుంచి త‌ప్పించుకునేందుకు కోతి తన చేష్టలతో చిరుత దూకుడు బ్రేకులు వేసేసింద‌నే చెప్పాలి.

ఈ వీడియోలో వేటాడే ఉద్దేశ్యంతో ఆక‌లి మీదున్న చిరుతకు కోతి చిక్క‌కుండా ముప్పు తిప్పులు పెడుతుంద‌ని గ‌మ‌నించొచ్చు.కోతిని ప‌ట్టుకునే క్ర‌మంలో తాను పడేపోతానేమో అన్న భయంతో చిరుత ఎక్కువ ఎత్తు అన‌గా చెట్టు చివ‌ర‌కు ఎక్కే సాహసం చేయట్లేదని తెలుస్తోంది.ఇక ఇదే అదునుగా కోతి ఆ కొమ్మపై నుంచి ఈ కొమ్మపైకి అన్న‌ట్టు అటూ ఇటూ దూకుతూ చిరుత‌ను మూడు చెరువుల నీళ్లు తాగించింది.ఇక చివ‌ర‌కు చిరుత ఆశలు మొత్తం అడియాశలైపోవ‌డంతో వెన‌క్కు తిరిగి వెళ్తుంది.

ఇక వీడియోను లైఫ్ అండ్ డెత్ గా నెటిజ‌న్లు పేర్కొంటూ కామెంట్లు పెడుతున్నారు.

#LeopardHunts #LifeAnd #Monkey #ViralAnimals #Leopard

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు