వైర‌ల్ వీడియోః కుక్క‌ను కిడ్నాప్ చేసిన కోతి..

చిన్న పిల్ల‌లు ఏదైనా చిత్ర‌మైన ప‌న‌లు చేస్తే కోతి చేష్ట‌లు అంటూ తిడుతుంటారు త‌ల్లిదండ్రులు.ఎందుకంటే కోతులు మాత్రమే అలాంటి విచిత్ర‌మైన ప‌నులు చేస్తుంటాయి.

 The Monkey Who Kidnapped The Dog-TeluguStop.com

అయితే ఓ కోతి కిడ్నాప్ చేసిన సంగ‌తి మీకు తెలుసా.చాలా సార్లు కోతులు ఏవైనా తినే వ‌స్తువులు, లేదంటే ఇత‌ర ముఖ్య‌మైన వ‌స్తువుల‌ను కూడా దొంగిలించ‌డాన్ని మ‌నం చూస్తూ ఉన్నాం.

కానీ ఓ కోతి ఏకంగా క‌క్క పిల్ల‌ను కిడ‌బ్నాప్ చేయ‌డాన్ని మీరెప్పుడైనా చూశారా.చూడ‌క పోతే ఈ వీడియో గురించి తెలుసుకుందాం.

 The Monkey Who Kidnapped The Dog-వైర‌ల్ వీడియోః కుక్క‌ను కిడ్నాప్ చేసిన కోతి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ వీడియో చూసిన త‌ర్వాత కోతులు ఇలా కూడా చేస్తాయా అనిపిస్తుందేమో.

ఎందుకంటే సాధార‌ణంగా మ‌న‌కు కిడ్నాప్ అన‌గానే అదేదో మ‌నుషుల‌కు సంబంధించింది అనే అనుకుంటారు.

కానీ కోతులు కూడా ఇలాంటివి చేయ‌గ‌ల‌వండోయ్‌.ఈ కిడ్నాపర్ కోతి గురించి తెలుసుకుంటే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయేమో.

ఈ వీడియోలో ఓ కోతి త‌న‌కు ద‌గ్గ‌ర‌లోని ఇంట్లోకి చొరబడుతుంది. అయితే ఆ ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కను ఎత్తుకెళ్ల‌డం చూడొచ్చు.

ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైర‌ల‌ళ్ అవుతోంది.ఇంట్లోకి వ‌చ్చిన ఆ కోతి ఏవైనా ఆహార పదార్థాల కోసం వ‌చ్చిందేమో అనుకున్నారు.

కానీ కుక్కపిల్లను కిడ్నాప్ చేసి ద‌గ్గ‌ర‌లోని చెట్టు ఎక్కేసింది.చాలా సేపు చెట్లపైనే తిరుగుతూ చుక్క‌లు చూపించింది.ఒక రోజు కాదండోయ్ దాదాపుగా మూడు రోజులు కుక్క యజమానులను నానా తిప్పలు పెట్టింది ఈ కిడ్నాప‌ర్ కోతి.మూడు రోజుల తరువాత చాలా క‌ష్ట‌ప‌డి ఆ కోతిని ఎలాగోలా ప‌ట్టుకుని త‌మ కుక్క పిల్లను ఆ య‌జ‌మానులు తీసుకున్నారు.

అయితే ఆ కోతి కుక్క పిల్లను త‌న కోతిపిల్ల నుకుని ఇలా ఎత్తుకెళ్లిందని చెబుతున్నారు వారంతా కూడా.కానీ విచిత్రం ఏంటంటే ఆకోతి కుక్కను చాలా జాగ్రత్తగా చూసుకోవ‌డం అంద‌రినీ షాక్ కు గురి చేస్తుంది.

.

#Kidnapped Dog #Intrenet #Monkey #Nmedia

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు