చెట్టు నుంచి డబ్బుల వర్షం కురిపించిన కోతి!

సాధారణంగా కోతులు అల్లరి పనులు చేసి అందరిని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి.మన చేతిలో ఏవైనా వస్తువులు కనిపిస్తే ఒక్కసారిగా మనపై దాడి చేసి మన చేతిలో ఉన్న వస్తువులను లాక్కెళ్లి పోతుంటాయి.

 Monkey,money From Tree,monkey Rained Money From Tree, Uttar Pradesh, Yssar Clini-TeluguStop.com

కోతులు అంటే ఇలా అల్లరి పనులు చేస్తూ ఉంటాయి.కొన్నిసార్లు కోతులు చేసే పనులు ఎంతో సరదాగా అనిపించినప్పటికీ, మరి కొన్నిసార్లు మాత్రం ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది.

అలాంటి సంఘటన ఉత్తర ప్రదేశ్, సీతాపూర్ లో చోటు చేసుకుంది.పూర్తి వివరాలతో వెళ్తే…

ఉత్తర ప్రదేశ్ సీతాపూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి పని నిమిత్తం వికాస్ భవన్ రిజిస్టర్ ఆఫీస్ వద్దకు ఒక బ్యాగ్ చేతపట్టుకుని వచ్చాడు.

ఆ బ్యాగులో నాలుగు లక్షల రూపాయల నగదు డబ్బులు ఉండటంతో ఆ వ్యక్తి ఎంతో జాగ్రత్తగా ఆసంచిని పట్టుకుని వెళ్తున్నాడు.అది గమనించిన ఒక కోతి ఒక్కసారిగా అతని పై దూకి ఆ సంచిని లాక్కొని వెళ్ళింది.

ఒక్కసారిగా డబ్బు ఉన్న సంచిని కోతి లాక్కొని పోవడంతో ఆ వ్యక్తి ప్రాణాలు పోయినంత పనయింది.

Telugu Tree, Monkey, Monkey Tree, Uttar Pradesh-Latest News - Telugu

కోతి డబ్బులు బ్యాగు లాక్కెళ్ళిందని ఆ వ్యక్తి గట్టిగా కేకలు వేయడంతో అందరూ ఆ కోతిని పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు.అందరూ గట్టిగా కేకలు వేయడంతో ఒక్కసారిగా కోతి చెట్టెక్కి డబ్బుల సంచిని తెరిచి డబ్బులను గాలిలోకి విసరడం మొదలుపెట్టింది.ఒక్కసారిగా డబ్బులు అలా గాలిలో ఎగరడంతో పెద్ద ఎత్తున ఆ డబ్బులను ఏరుకోవడానికి జనం గుమిగూడారు.

మరికొందరు మాత్రం ఆ కోతి నుంచి డబ్బులు సంచిని లాక్కోవడానికి చెట్టు ఎక్కారు.ఇలా ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి చివరకు ఆ కోతి నుంచి డబ్బుల సంచిని లాక్కొని ఆ వ్యక్తికి అందజేశారు.

అయితే ఆ కోతి సంచిలో నుంచి దాదాపు 12 నుంచి 14,000 దాకా గాలిలోకి విసిరినట్టు తెలుస్తోంది.ఈ విషయంపై సమీప కొత్వాల్ పోలీస్ స్టేషన్లు బాధితుడు ఫిర్యాదు చేసి కేసును నమోదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube