కోతి హావభావాలు.. దాన్ని చూసి జ‌డుసుకున్న కోతి ? సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్ !

అనేక సంద‌ర్భాల్లో చాలామంది పిచ్చిపిచ్చిగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు.అలాంట‌ప్పుడు కోతి చేష్ట‌లు చేయొద్దు.

 Monkey Face Expressions Video Viral On Social Media Details, Monkey, Social Medi-TeluguStop.com

అంటూ వారిస్తుంటాం.ఎందుకంటే కోతుల చేష్ట‌లు ఆ రేంజ్‌లో ఉంటాయ‌న్న‌మాట‌.

కొన్ని కోతులు ప్ర‌వ‌ర్తించే తీరు విచిత్రంగా ఉంటుంది.అప్పుడప్పుడు మ‌నుషుల్లా హావభావాలు వ్య‌క్త‌ ప‌రుస్తుంటాయి.

ఇక శిక్ష‌ణ పొందిన కోతుల గురించి మ‌నం మాట్లాడు కోవాల్సిన ప‌ని ఉండదు.స‌ర్క‌స్‌ల‌లో అయితే వీటిని మ‌నం చూసి సంబుర‌ ప‌డొచ్చు.

కొన్ని శిక్ష‌ణ లేకుండానే అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతాయి.సాధార‌ణంగా కోతి చేష్ట‌లంటే అంద‌రికీ న‌వ్వులు పూయిస్తాయి.

అవి చేసే అల్ల‌రి గురించి తెలిసిన విష‌య‌మే.కాగా కోతుల‌కు సంబంధించిన వీడియోలు మాత్రం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంటాయి.

అవి చూసిన వారెవ‌రైనా క‌డుపుబ్బా న‌వ్వి తీరాల్సిందే.అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.

సాధార‌ణంగా జంతువుల చేష్ట‌లు భ‌లే ఫ‌న్నీగా ఉంటాయి.ఇలాంటివే ఇంట‌ర్నెట్‌లో అత్య‌ధికంగా పోస్ట్ చేస్తుంటారు.

క్ష‌ణాల్లోనే వైర‌ల్ అయి నెటిజన్లు చేసే కామెంట్లు మ‌నం చూసి ఉంటాం.తాజాగా ఓ కోతి పిట్ట‌ముందు చేసిన చేష్ట‌ల‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.

భ‌లే ఉందిలే అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇంత‌కు కోతి ఏమి చేసింద‌నుకుంటున్నారా ? అయితే మీరు ఈ కోతి వీడియో చూడాల్సిందే.ఈ వీడియోలో ఓ ప్రాంతంలో ఉన్న బ‌ల్ల‌పై పిట్ట ఉంది.దాని ముక్కు పొడువుగా ఉంది.దాని ప‌క్క‌నే ఉన్న ఓ కోతి పిట్ట ముక్కును చూసి దీర్ఘంగా చూడ‌డం మొద‌లు పెట్టింది.

ఏంటిదీ ? ఇంత పొడ‌వుగా ఉంద‌ను కుందేమో త‌దేకంగా చూస్తూ ఉండి పోయింది.అటు ఇటు చూసి పిట్ట త‌ల‌ను తాకేందుకు య‌త్నించింది.ఇంత‌లోనే ఆ పిట్ట ఏదో ఇస్తుంద‌నుకుందేమో త‌ల‌ను కోతి వైపు తిప్పి ముక్కును చూపించింది.

ఆ పొడ‌వాటి ముక్కు త‌న చేతికి ఏమైనా గాయ‌ ప‌రుస్తోంద‌నుకుని జ‌డిసి ప‌క్క‌కు జ‌రుగుతుంది.ఇదీ ఫ‌న్నీగా అనిపించినా.వీడియోలో కోతి చేసిన హావ భావాల‌కు ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిందే.అయితే ఈ వీడియోను ల‌వ్లీ ఆనిమ‌ల్స్ -ల‌వ్లీ ఖాతాపేరుతో ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయ‌గా తెగ వైర‌ల్ అవుతోంది.

మీరూ ఓ లుక్కేయండి.

ఓ కోతి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.24 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఓ కోతి కూరగాయాలు అమ్ముతూ కనిపించింది.వ్యాపారి స్థానంలో ఎంతో బుద్ధిగా కూర్చున్న ఆ కోతిని చూసి నెటిజనులు తెగ మురిసిపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube