పులికి చుక్కలు చూపించిన కోతి... వైరల్ వీడియో

మనకు నిత్యజీవితంలో ఎటువంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా మనల్ని కాపాడేది మనకున్న మానసిక బలం.మన బలాన్ని మనం గట్టిగా నమ్ముకొని ప్రయోగిస్తే ఎంత పెద్ద ప్రమాదం ఎదురుగా ఉన్నా మనం ఆ ప్రమాదం నుండి ఈజీగా బయటపడతాం.

 The Monkey Escaping From The Tiger Viral Video, Viral News, Viral News In Intern-TeluguStop.com

మనం భయపడితే ఆ ప్రమాదం నుండి బయటపడకుండా అక్కడే ఆగిపోతాం.అచ్చం ఇలాగే జరిగిన ఓ ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

పులి అనేది క్రూర జంతువు.ఒక్కసారి పులి గురి పెట్టిందంటే ఇక అంతే సంగతులు.

అయితే అన్ని సార్లు మనకు నచ్చిన పాచికలు పారవు కదా.ఏనుగు ఎంత పెద్దది అయినా తన తొండంలో ఒక చీమ దూరి అంత పెద్ద ఏనుగును సైతం ముప్పు తిప్పలు పెట్టగలదు.ఇప్పుడు అలాగే జరిగింది.ఒక కోతిని వేటాడుదామని అనుకున్న చిరుతను కోతి ముప్పు తిప్పలు పెట్టింది.కోతిని వేటాడుదామని చెప్పి అనుకున్న పులి కోతిని వెంబడించే క్రమంలో కోతి ఒక చెట్టును ఎక్కింది.వెంటనే పులి సైతం చెట్టును ఎక్కింది.

కాని కోతిని పట్టుకుందామని ప్రయత్నిస్తున్నా కోతి ఒక కొమ్మ నుండి మరొక కొమ్మలోకి దూకింది.అయితే పులి అలా దూకడం సాధ్యం కాదు కాబట్టి పులి వెంటనే అంత ఎత్తు నుండి క్రింద పడింది.

వీడియో చూస్తున్న నెటిజన్లకు ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.పులిని తనకున్న బలంతో కోతి ఎంత సులభంగా ఓడించిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారుతోంది.నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube