మరోసారి కాంగ్రెస్ ను నిరాశపరిచిన ఎమ్మెల్సీ ఫలితాలు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల బలం కీలక పాత్ర పోషిస్తుందనే విషయం తెలిసిందే.

 The Mlc Results Disappointed Congress Once Again, Telangana Politics, Congress P-TeluguStop.com

అయితే అభ్యర్థుల బలం లేదు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నుండి బీజేపీ తప్పుకున్న విషయం తెలిసిందే.అయితే ఈటెల మాత్రం కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ని బరిలో నిలిపి తనదైన వ్యూహంతో టీఆర్ఎస్ కు షాకిచ్చినా అంతగా ఫలితం లేకపోయింది.

చివరికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు.అయితే కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ కు పోటీగా అన్ని స్థానాల్లో పోటీ చేయకున్నా రెండు, మూడు చోట్ల పోటీలో ఉన్నా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవి చూడక తప్పలేదు.

అందుకు ముఖ్య ఉదాహరణగా మనం మెదక్ ఎమ్మెల్సీ స్థానాన్ని తీసుకోవచ్చు.మెదక్ ఎమ్మెల్సీ స్థానంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి పోటీలో ఉన్న విషయం తెలిసిందే.

అయితే ఈ స్థానం ఖచ్చితంగా కాంగ్రెస్​దే నని ట్రబుల్ షూటర్ కు ట్రబుల్ తప్పదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.అయితే నేడు వెలువడ్డ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో మెదక్ ఎమ్మెల్సీ స్థానం కూడా టీఆర్ఎస్ వశం కావడంతో కాంగ్రెస్ పెట్టుకున్న ఒకే ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ సత్తా చాటలేకపోయింది.

అయితే ఒక్క ఎమ్మెల్సీ స్థానంలో గెలుపొందినా టీఆర్ఎస్ పార్టీ కంటే తరువాతి స్థానంలో ఉండే అవకాశం ఉండేది.కాని ఎమ్మెల్సీ స్థానం ఓటమితో కాంగ్రెస్ మరొక్క సారి క్షేత్ర స్థాయిలో తమ బలాన్ని పెంచుకోవటంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

మరి పోటీలో ఉన్న ఎమ్మెల్సీ స్థానాలలో ఓటమిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube