అయ్య‌న్న పాత్రుడిని అంత మాట అనేసిన ఎమ్మెల్యే.. ర‌ణం మొద‌లైంది..

ఏపీలో మాజీ మంత్రిగా పని చేసిన అయ్యన్న పాత్రుడు గురించి చాలా మందికే తెలుసు.టీడీపీలో అయ్యన్న సీనియర్ నాయకుడిగా ఉంటూ వస్తున్నారు.

 The Mla Who Said Such A Thing To Ayyanna Patrudu Details, Ayyanna Patrudu, Tdp,-TeluguStop.com

ఏపీ రాజకీయాల్లో సీనియర్లయినా, జూనియర్లయినా ఎలాంటి వ్యాఖ్యలు పడితే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.ఇన్నాళ్లూ రాజకీయాల్లో కొన్ని విలువలు ఉండేవి.

కానీ ప్రస్తుతం అటువంటి సందర్భం కనిపించడం లేదు.ఎలాగైనా మాట్లాడేస్తున్నారు.

రాజకీయాల్లోకి పిల్లలనూ, ఇంట్లోని ఆడవాళ్లను తీసుకొచ్చేవారు కాదు కానీ ఇప్పుడు అదేం లేదు.ఎంతంటే ఎంత అనే స్థాయికి రాజకీయాలు చేరుకున్నాయి.

రాజకీయాలంటే ఓ మురికి గుంట అని చాలా మంది విశ్వసిస్తుంటారు.అదే నిజమని ఇప్పటి రాజకీయ నాయకులు ప్రూవ్ చేస్తూ వస్తున్నారు.

పార్టీలేవైనా సరే ఏపీలో మాత్రం ఇటువంటి నీచ రాజకీయాలకు కొదువ లేదు.ఇంతటి వికృత రాజకీయ క్రీడలు ఎక్కడి వరకు వెళ్తాయో అని అందరూ తెగ కంగారు పడిపోతున్నారు.

ఇంతకీ ఇప్పుడు ఏమైందంటే…

మొన్నటికి మొన్న ఏపీ రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన చంద్రబాబు తన సతీమణిని వైసీపీ వాళ్లు అకారణంగా మాటలు అన్నారని మీడియా ముందే గుక్క పెట్టి ఏడ్చేశాడు.వైసీపీ వాళ్లకి సంస్కారం లేదు అని అందరూ అనుకున్నారు.

కానీ ఇప్పుడు టీడీపీ వాళ్లు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు.టీడీపీలో సీనియర్ నాయకుడైన అయ్యన్నపాత్రుడు ఏకంగా సీఎం భార్యనే రాజకీయాల్లోకి లాగాడు.

‘అమ్మా భారతమ్మ.మీ ఆయన్ను మంచి ఆసుపత్రిలో చూపించు అమ్మా.హైదరాబాద్ కు గానీ వైజాగ్ కు కానీ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించు అమ్మా… అతడి తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రం అప్పుల పాలవుతుందని అన్నాడు.దీనిపై వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఆ పార్టీకి చెందిన దువ్వాడ శ్రీనివాస్ అనే ఎమ్మెల్యే మరో అడుగు ముందుకేసి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నపుంసకుడని వ్యాఖ్యానించడం గమనార్హం.

The MLA Who Said Such A Thing To Ayyanna Patrudu The Debt Has Started , Ayyanna Patrudu, Tdp - Telugu Ayyanna Patrudu #Shorts

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube