దర్శకుడు క్రిష్ విడుదల చేసిన మిస్సింగ్ సినిమా ప్రమోషనల్ సాంగ్ ఈ నెల 29న థియేటర్లలో సినిమా విడుదల

The Missing Movie Promotional Song Released By Director Krish Will Be Released In Theaters On The 29th Of This Month

హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమామిస్సింగ్”.ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు.

 The Missing Movie Promotional Song Released By Director Krish Will Be Released In Theaters On The 29th Of This Month-TeluguStop.com

మిస్సింగ్ చిత్రంతో శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “మిస్సింగ్” చిత్రం ఈనెల 29న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.

గురువారం చిత్ర ప్రమోషనల్ సాంగ్ ఖుల్లమ్ ఖుల్లాను ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు.

 The Missing Movie Promotional Song Released By Director Krish Will Be Released In Theaters On The 29th Of This Month-దర్శకుడు క్రిష్ విడుదల చేసిన మిస్సింగ్ సినిమా ప్రమోషనల్ సాంగ్ ఈ నెల 29న థియేటర్లలో సినిమా విడుదల-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో హీరో హర్షా నర్రా మాట్లాడుతూ…మా “మిస్సింగ్సినిమాలోని ప్రమోషనల్ సాంగ్ ఖుల్లమ్ ఖుల్లా ను రిలీజ్ దర్శకుడు క్రిష్ గారికి చాలా థాంక్స్.

అనురాగ్ కులకర్ణి బాగా పాడాడు.అంతా కొత్తవాళ్లం చేసిన ప్రయత్నమిది.తప్పకుండా మీకు నచ్చేలా ఉంటుంది.థియేటర్ లలో ఈనెల 29న విడుదల చేసేందుకు రెడీ అయ్యాం.

థియేటర్ లోనే ఎందుకు అంటే, మిస్సింగ్ మూవీని థియేటర్ లో చూసే ఎక్సీపిరియన్స్ వేరుగా ఉంటుంది.మా సినిమాలోని విజువల్స్, సౌండింగ్, మేకింగ్ థియేటర్స్ కే కరెక్ట్.

మంచి థ్రిల్లర్ మూవీ చేశాం.ఫ్యామిలీ అంతా చూసేలా సినిమా ఉంటుంది.

కమర్షియాలిటీ కోసం అడల్ట్ సీన్స్, ఇతర అంశాలు సినిమాలో ఉండవు.సినిమా చూశాక మీకు నచ్చితే పది మందికి చెప్పండి.

సినిమా బాగుందని తెలియాలంటే మౌత్ టాక్ ఇంపార్టెంట్.మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్.

అన్నారు.

నటుడు అశోక్ వర్థన్ మాట్లాడుతూ…ఇటీవల క్రిష్ గారి సినిమా కొండపొలంలో నటించాను.నాకు అవకాశం ఇచ్చిన క్రిష్ గారికి థాంక్స్.అలాగే మా మిస్సింగ్ సినిమా ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నాం.

మిస్సింగ్ సినిమాను మా దర్శకుడు శ్రీని జోస్యుల సూపర్బ్ గా తెరకెక్కించారు.సినిమా అంతా బాగుంటుంది, కొన్ని సీన్స్ అయితే అద్భుతంగా వచ్చాయి.చిన్న సినిమాకు ప్రేక్షకుల మౌత్ టాక్ చాలా ముఖ్యం.మీకు నచ్చితే మీ ఫ్యామిలీని తీసుకుని మిస్సింగ్ సినిమాకు రండి.

అన్నారు.

హీరోయిన్ నికీషా మాట్లాడుతూ…మిస్సింగ్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది.థియేటర్ లలో మిమ్మల్ని కలుసుకునేందుకు వెయిట్ చేస్తున్నాము.ఈ సినిమాలో మిస్ అయ్యేది నేనే.

నాకోసం హీరో సహా మిగతా వాళ్లంతా సెర్చ్ చేస్తుంటారు.సినిమా మీకు థ్రిల్లింగ్ ఎక్సీపిరియన్స్ ఇస్తుంది.

తప్పకుండా థియేటర్ కు వచ్చి మిస్సింగ్ మూవీ చూడండి.అన్నారు.

హీరోయిన్ మిషా నారంగ్ మాట్లాడుతూ…మా మిస్సింగ్ మూవీకి మీరు ఇస్తున్న టైమ్ అండ్ సపోర్ట్ కు థాంక్స్.ఇదొక యూనిక్ సబ్జెక్ట్ ఉన్న సినిమా.మిస్సింగ్ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి.థ్రిల్లింగ్, రొమాన్స్, సస్పెన్స్ ఇలా మీకు నచ్చే అన్ని ఎలిమెంట్స్ తో సినిమాను తెరకెక్కించారు దర్శకుడు శ్రీని.

మా టీమ్ కోసం మీ దగ్గర్లోనే థియేటర్ లలో ఈనెల 29న మిస్సింగ్ చూడండి.అన్నారు.

సూర్య, ఛత్రపతి శేఖర్, రామ్ దత్, విష్ణు విహారి, అశోక్ వర్థన్, వినోద్ నువ్వుల తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సాహిత్యం – వశిష్ఠ శర్మ, కిట్టు విస్సాప్రగడ, శ్రీని జోస్యుల, మేకప్ – వెంకటేష్ బాల, కాస్ట్యూమ్స్ – టీఎస్ రావు, ప్రొడక్షన్ డిజైనర్ – దీక్ష రెడ్డి, కాస్ట్యూమ్స్ డిజైనర్ : శ్రుతి కిరణ్, ఆర్ట్ – దార రమేష్ బాబు, పైట్స్ – పి.సతీష్, డాన్స్ – బంగర్రాజు, జీతు, స్టిల్స్ – గుంటూరు రవి, ప్రొడక్షన్ కంట్రోలర్ – బి సి చౌదరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సాయి కె కిరణ్, ఎడిటర్- సత్య జి, సంగీతం – అజయ్ అరసాడ, సినిమాటోగ్రఫీ – జనా.డి, పీఆర్వో – జీఎస్ కె మీడియా, నిర్మాతలు – భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరిరావు నర్రా, కథా మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం – శ్రీని జోస్యుల.

#Ashok Vardhan #Krish #Harsha Narra #Misha Narang #Promotional

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube