ఇదేందిది.. పాల వ్యాను బోల్తా.. జ‌నం ఏం చేశారో తెలిస్తే...!

సాధారణంగా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఎవరైనా మంచి మనసున్న వారు ఏం చేస్తారు? క్షతగాత్రులను ఆస్ప్రతికి తరలించే ప్రయత్నం చేస్తారు.కిందపడ్డ వారి వస్తువులను వారికి తిరిగి అప్పజెప్తారు.

 The Milk Van Overturned If The People Knew What They Did-TeluguStop.com

అయితే, ఇప్పుడు అలాంటి పరిస్థితులు అస్సలే లేవు అని చెప్పడానికి ఈ ఘటనే ఓ ఉదాహరణ అని చెప్పొచ్చు.అసలేం జరిగిందంటే.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఓ పాల వ్యాన్ యాక్సిడెంట్ వల్ల రోడ్డు పక్కన పడిపోయింది.అయితే, ఆ దుర్ఘటన వల్ల ఎవరికి ఏమైంది అని ఆలోచించకుండా అక్కడి స్థానికులు ఆ లారీలోని పాలు దొంగిలించారు.

 The Milk Van Overturned If The People Knew What They Did-ఇదేందిది.. పాల వ్యాను బోల్తా.. జ‌నం ఏం చేశారో తెలిస్తే…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కర్నూలు జిల్లా కల్లూరు మండలం బస్తిపాడు వద్ద ఈ ఘటన జరిగింది.పాల వ్యాను బోల్తా పడగా, అందులోని డ్రైవర్‌, క్లీనర్‌ ఎలా ఉన్నారో జనాలు పట్టించుకోలేదు.

చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల వాళ్లు అందరూ వచ్చి నల్లాల చోట నీళ్లు కోసం కొట్లాడుకున్న మాదరి పాల వ్యానులోని పాలను దొంగిలించారు.వారి చేతికి ఏది దొరికితే అది కొందరు బాటిళ్లు, బకెట్లు, బిందెలు, ఇతరాలలో పాలను నింపుకుని తీసుకెళ్లారు.

దీనిని బట్ట మనుషులు ఎంత దోపిడీకి అలవాటు పడ్డారో తెలుసుకోవచ్చు.ఒక దుర్ఘటనలోనూ దోపిడీని చూసి మనుషులు ఎంత కక్కుర్తి పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.అవతలి వ్యకుల ప్రాణాల పరిస్థితి పట్టించుకోకుండా పాలకు ఎగబడటాన్ని బట్టి మనుషులు దయాహీనులుగా మారరో ఈజీగా అంచనా వేసుకోవచ్చు.కాగా, జనాలు ఇలా చేయడాన్ని కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Telugu Andhra Pradesh, Chittor District, Corona, Milk, Milk Van Overturned, People Theft Milk, Road Accident, Van Fell Down-Latest News - Telugu

ఇది నెట్టింట తెగ వైరలవుతోంది.కొవిడ్ వల్ల కొంత మేరకు జనాల్లో హెల్ద్ కాన్షియస్‌నెస్ పెరిగిందని, ఇతరులు బాగుండాలని ప్రజలు కోరుకుంటున్నారని ఇది సొసైటీకి చాలా మంచిదని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.కానీ, అదే కరోనా వల్ల చాలా మంది జీవితాలు కుదేలు కాగా, నిత్యావసరాలకు తల్లడిల్లుతున్నారని మరి కొందరు తెలిపారు.ఈ నేపథ్యంలో జనాల్లో దురాశ కూడా బాగా పెరిగిపోయిందని చెప్పేందుకు తాజాగా పాల దొంగతనం ఘటన ద్వారా తెలుసుకోవచ్చు.

#Corona #Theft Milk #Andhra Pradesh #Milk #Road

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు