మెగా ప్రిన్సెస్ ఫోటో లీక్... నిజం కాదంటూ క్లారిటీ ఇచ్చిన మెగా ఫ్యామిలీ!

మెగా ఫ్యామిలీలోకి మూడోతరం వారసురాలు అడుగుపెట్టింది.రాంచరణ్(Ramcharan) ఉపాసన (Upasana) దంపతులు పెళ్లైన 11 సంవత్సరాలకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

 The Mega Family Took A Key Decision On The Leak Of Mega Princess Photos Details,-TeluguStop.com

మంగళవారం తెల్లవారుజామున అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఆడబిడ్డకు(Baby Girl) జన్మనిచ్చారు.ఈ విధంగా ఉపాసన రాంచరణ్ దంపతులు తల్లిదండ్రులుగా మారడంతో మెగా ఫ్యామిలీలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడింది.

అదేవిధంగా తమ వారసురాలని చూడటం కోసం మెగా ఫ్యామిలీ మొత్తం అపోలో ఆసుపత్రికి తరలివచ్చారు.అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Telugu Baby, Chiranjeevi, Princess, Varasuralu, Ramcharan, Upasana, Upasana Baby

ఇకపోతే మెగా వారసురాలు (Mega Varasuralu) అంటూ ఒక చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం మనకు తెలిసిందే.అయితే ఇది నిజంగానే రామ్ చరణ్ ఉపాసన కూతురి ఫోటోనేనా అన్న సందేహం కూడా కలిగింది.అయితే ఈ ఫోటోపై మెగా ఫ్యామిలీకి చెందిన అత్యంత సన్నిహితులు స్పందించి క్లారిటీ ఇచ్చారు.అసలు సోషల్ మీడియాలో రామ్ చరణ్ కూతురు అంటూ వైరల్ అవుతున్న ఆ ఫోటోలో ఉన్న చిన్నారి రామ్ చరణ్ కూతురు కాదని తెలిపారు.

అయితే త్వరలోనే అసలైన మెగా ప్రిన్సెస్ (Mega Princess) ఫోటోని సోషల్ మీడియా వేదికగా చాలా గ్రాండ్ గా రివిల్ చేయబోతున్నారని వెల్లడించారు.

Telugu Baby, Chiranjeevi, Princess, Varasuralu, Ramcharan, Upasana, Upasana Baby

ఇలా మెగా ఫ్యామిలీకి చెందినటువంటి సన్నిహితులు మెగా ప్రిన్సెస్ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఎంతోమంది అభిమానులు రామ్ చరణ్ కు అబ్బాయి పుడతారని మెగా వారసత్వం అలాగే కొనసాగుతుందని సంతోషపడ్డారు.కానీ అమ్మాయి పుట్టడంతో ఓకింత నిరుత్సాహం వ్యక్తం చేసిన అనంతరం వారసురాలు వచ్చిందంటూ సంతోషం వ్యక్తం చేశారు.

ఇక ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారని త్వరలోనే డిశ్చార్జ్ అవ్వబోతారు అంటూ అపోలో హాస్పిటల్ వైద్యులు కూడా ఉపాసన, తన బిడ్డ ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube