పోలవరంపై ముగిసిన కేంద్ర జలశక్తి శాఖ సమావేశం

పోలవరంపై నాలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల వర్చువల్ సమావేశం ముగిసింది.పోలవరం బ్యాక్ వాటర్ పై ఇప్పటికే అధ్యయనం చేశామని కేంద్ర జల శక్తి శాఖ తెలిపింది.2009, 2011లో శాస్త్రీయమైన సర్వేలు జరిగాయని వెల్లడించింది.ముంపు ప్రభావంపై ఒడిస్సా, తెలంగాణ, చత్తీస్ గఢ్ రాష్ట్రాలవి అపోహలు మాత్రమేనని పేర్కొంది.

 The Meeting Of The Central Hydropower Department Concluded On Polavaram-TeluguStop.com

అంతేకాకుండా భద్రాచలానికి ఎలాంటి ముంపు సమస్య లేదని కేంద్రం స్పష్టం చేసింది.పోలవరం పూర్తయ్యాక కూడా మూడు రాష్ట్రాల్లో ముంపు ప్రభావం ఉండదని తేల్చి చెప్పింది.

ముంపు ప్రభావం లేకుండా కరకట కట్టేందుకు ఏపీ సిద్ధమైన ఒడిస్సా ప్రజాభిప్రాయ సేకరణకు ముందుకు రాలేదని కేంద్రం తెలిపింది.ఈ నేపథ్యంలో బ్యాక్ వాటర్ పై మరో మారు సర్వే చేయించాలన్న తెలంగాణ వాదనను కేంద్రం తోసిపుచ్చింది.

అనంతరం అక్టోబర్ 7న నాలుగు రాష్ట్రాల ఈఎన్సీ లతో కేంద్ర జల శక్తి శాఖ మరోసారి భేటీ కానున్నట్లు తెలిపింది.బ్యాక్ వాటర్ సర్వేకి సంబంధించిన సాంకేతిక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube