'ఫోకస్ ' కోల్పోయిన షర్మిల పార్టీ ?

ఆదిలోనే హంసపాదు అన్నట్లు తయారైంది వైఎస్ షర్మిల ఏర్పాటుచేసిన కొత్త పార్టీ వైఎస్సార్ టీపి పరిస్థితి.అసలే చేరికలు పెద్దగా కనిపించకపోగా, కొద్దో గొప్పో పార్టీలో చేరిన వారు ఇప్పుడు తమ దారి తాను చూసుకుంటూ ముందుకు వెళ్తుండడంతో ఆ పార్టీ నేతల్లో దడ పుట్టిస్తోంది.

 Ys Sharmila, Telangana, Trs, Kcr, Ysrtp, Indira Soban, Sharmila Party, Ysrtp Med-TeluguStop.com

తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తమ పార్టీ పుట్టిందని గొప్పగా ప్రకటించుకున్నారు షర్మిల.  టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, టిఆర్ఎస్ కు తెలంగాణలో తాము సరైన ప్రత్యేర్దూలం అని నిరూపించేందుకు షర్మిల ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా, అవేవీ వర్కవుట్ అవ్వడంలేదు.

నిరుద్యోగ సమస్యను ప్రధానంగా చేసుకుని షర్మిల పోరాటాలకు దిగుతున్నారు.ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతున్నారు.

తెలంగాణ లో ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చుతున్నారు.అయినా పెద్దగా షర్మిల పార్టీకి ఆదరణ వచ్చినట్టుగా కనిపించడం లేదు.

Telugu Indira Soban, Sharmila, Telangana, Ys Sharmila, Ysrtp-Telugu Political Ne

మొదట్లో మీడియా ఫోకస్ ఎక్కువగా ఆ పార్టీకి ఉండేది.టిడిపి అనుకూల ఛానల్ గా ముద్రపడిన ఓ ప్రధాన మీడియా షర్మిల పార్టీ ని హైలెట్ చేస్తూ వచ్చేది.ఆ చానల్ కు కెసిఆర్ పై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం ఉండడంతో షర్మిల పార్టీ ని హైలెట్ చేస్తూ వచ్చే వారు.తెలంగాణలో షర్మిల పార్టీకి ఆదరణ ఏ మాత్రం ఉండదు అనే అంచనా వచ్చేయడంతో ఇప్పుడు ఆ చానల్ కూడా పార్టీకి ఫోస్ బాగా తగ్గించింది.

ఇక ఆమె పార్టీ కార్యక్రమాలన్నీ ఒక ఈవెంట్ మాదిరిగా చోటు చేసుకుంటూ ఉండడంతో, జనాల్లోనూ పెద్దగా గుర్తింపు రావడం లేదు.ఇప్పటికే ఆ పార్టీలో చేరిన ఎంతోమంది తమ దారి తాము చూసుకున్నారు.

తాజాగా కీలక నాయకురాలు ఇందిరా శోభన్ షర్మిల పార్టీకి గుడ్ బై చెప్పేసారు.

Telugu Indira Soban, Sharmila, Telangana, Ys Sharmila, Ysrtp-Telugu Political Ne

అయితే షర్మిల పార్టీని పెద్దగా పట్టించుకోని కొన్ని ప్రధాన మీడియా, పార్టీ నుంచి బయటకు వచ్చిన వారి ఇంటర్వ్యూలను తీసుకుని ప్రచారం చేస్తున్నాయి.ఇదే విధంగా ఇందిరా శోభన్ ఇంటర్వ్యూలు తీసుకుని ప్రచారం చేసేందుకు పోటీ పడ్డాయి.ఇక షర్మిల పార్టీలో ఆమె తప్ప మిగతా నేతలు ఎవరు పెద్దగా జనాలకు పరిచయం లేని వారు కావడం , పరిచయం ఉన్న కొద్దిమంది నేతలు హైలెట్ కాకుండా షర్మిల చూసుకోవడం ఇవన్నీ ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టి వేస్తున్నాయి.

పార్టీ నుంచి బయటకు వెళ్లే వారే తప్ప చేరేవారు ప్రస్తుతం కనిపించకపోవడంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీ మరింతగా దెబ్బతింటుంది అనే అంచనాలు అందరికీ వచ్చేసాయి.మొదట్లో షర్మిల పార్టీని ఆ పార్టీ విధానాలను భుజానికెత్తుకున్న కొన్ని మీడియా సంస్థలు ఇప్పుడు పూర్తిగా తప్పుకోవడంతో షర్మిల పార్టీ ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube