పాము కలలో కన్పిస్తే ఏమి అవుతుందో తెలుసా?       2018-06-15   00:40:24  IST  Raghu V

ప్రతి మనిషికి కలలు రావటం సహజమే. ఆ కలలను కొంతమంది గుర్తించుకుంటారు. అలాగే కొంత మంది వాటిని మర్చిపోతూ ఉంటారు. కలలో జంతువులు కూడా వస్తూ ఉంటాయి. ఆలా వచ్చే కలలో ఎక్కువగా పాములు వాస్తు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కలలో పాము అనేది సృజనాత్మక శక్తి అధికంగా ఉన్న వారికి మాత్రమే కన్పిస్తుందని చెప్పుతుంది. ఆలా కన్పిస్తే మంచిదని అంటారు జ్యోతిష్య నిపుణులు.

కొంత మంది కలలో పాము కన్పిస్తే భవిష్యత్ కి సంకేతం అని జీవితం ఊహించని మలుపు తిరుగుతుందని అంటూ ఉంటారు. పాముని చూస్తే చాలా భయపడతాం. ఆలా భయపడవలసిన అవసరం లేదని కొంత మంది అంటారు.

అలెగ్జాండర్ ఫ్లెమింగ్‌ పెన్సిలిన్ కనిపెట్టడానికి చాలా కాలం ప్రయత్నాలు చేసాడు. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. అయితే అలెగ్జాండర్ ఫ్లెమింగ్‌ కలలో పాము వచ్చిందట. పాము కదలికలను బట్టి ఆలోచన వచ్చి పెన్సిలిన్ ని కనుగొన్నాడని జ్యోతిష్య శాస్త్రవేత్తలు ఉదాహరణగా చెప్పుతారు.

కలలో పాము వచ్చి కాటేసి వెళ్లిందంటే జీవితంలో మీరు తీవ్రమైన ఒత్తిడి,అయోమయంలో ఉన్నట్టు అర్ధం. అలాగే ఇతరుల నుండి ఆపద పొంచి ఉందని చెప్పే సంకేతం.

పాము కలలో కన్పిస్తే పరిష్కారం కానీ సమస్యలు ఉన్నాయని అర్ధం. మీ ప్రియమైన వారితో కలహాలు,గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పాము కలలో కనిపించినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.