షియోమీ, ఒప్పో, వివో ఫోన్‌ల మాస్టర్ ప్లాన్... యాపిల్‌కు చెక్ పెట్టేందుకేనా?

ఈ ప్రపంచంలోని ఏ దేశ మార్కెట్లోనైనా యాపిల్( Apple ) ప్రొడక్ట్స్‌కి తిరుగులేదని చెప్పుకోవడంలో ఎంతమాత్రమూ అతిశయోక్తి లేదు.అదేవిధంగా చైనాలో కూడా వీటి హవా బాగానే నడుస్తోంది.

 The Master Plan Of Xiaomi, Oppo, Vivo Phones Is It To Check Apple ,data Sharing,-TeluguStop.com

ఆ దేశంలో పెరుగుతున్న యాపిల్ మార్కెట్ వాటాను చూసి చైనీస్ కంపెనీలు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు.అందుకే యూజర్లను తమ వైపు తిప్పుకునేందుకు సరికొత్త టెక్నాలజీలను తమ ప్రొడక్ట్స్‌లో ప్రవేశపెట్టడానికి కంకణం కట్టుకున్నాయి.

ఇందులో భాగంగానే దిగ్గజ చైనీస్ బ్రాండ్స్‌ ఒప్పో, వివో, షియోమీ( Oppo, Vivo, Xiaomi ) తమ ఫోన్ల మధ్య డేటా ట్రాన్స్‌ఫర్ సులభతరం చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి.

Telugu Chinese Brands, Transfer, Oppo, Tech, Vivo, Xiaomi-Latest News - Telugu

దీనికోసం కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టనున్నాయి.ఇక ఈ కొత్త టెక్నాలజీ సాయంతో యూజర్లు తమ సిస్టమ్, యాప్ డేటాను ఈ బ్రాండ్‌లలో ఏ కొత్త హ్యాండ్‌సెట్‌కైనా చాలా ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.ఇదే విషయాన్ని ఈ 3 స్మార్ట్‌ఫోన్ సంస్థలు వీబో వేదికగా ప్రకటించాయి.

అంటే ఒక యూజర్ ఒప్పో ఫోన్ నుంచి వివో ఫోన్‌కు మారితే.వారు తమ డేటా మొత్తాన్ని కొత్త ఫోన్‌కి ఎటువంటి సమస్య లేకుండా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

వినియోగదారులు ఈ బ్రాండ్‌ల మధ్య మారడాన్ని సులభతరం చేసే క్రమంలో చైనా మార్కెట్‌లో యాపిల్‌తో పోటీ పడడానికి ఈ కంపెనీలు కొత్త పీర్-టు-పీర్ ట్రాన్స్‌మిషన్ అలయన్స్ టెక్నాలజీని పరిచయం చేయనున్నాయి.

Telugu Chinese Brands, Transfer, Oppo, Tech, Vivo, Xiaomi-Latest News - Telugu

ఇకపోతే కొత్త స్మార్ట్‌ఫోన్‌కి మారేటప్పుడు డేటా ట్రాన్స్ఫర్( Data transfer) అనేది చాలా శ్రమతో కూడుకున్న పని.ఎందుకంటే కొత్త ఫోన్ కొన్నప్పుడు డేటాను పాత ఫోన్ నుంచి కొత్తదానికి మైగ్రేట్ చేయవలసి ఉంటుంది.ఇది చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది.

ఈ సమస్యను పరిష్కరించడానికే, ఈ టాప్ 3 చైనీస్ కంపెనీలు ఇపుడు చేతులు కలుపుతున్నాయి.అవును, ఒప్పో , వివో , షియోమీ తమ యూజర్లు డివైజ్‌ల మధ్య వైర్‌లెస్‌గా డేటాను బదిలీ చేయడానికి అనుమతించే సాంకేతికతను రూపొందించే పనిలో పడ్డాయి.

ఇది యాపిల్ ఎయిర్ డ్రాప్ వలె పని చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube