వామ్మో.. ఆ మాస్క్ ధర రూ.11 కోట్లు!

కనిపించని కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలన్నీ యుద్దం కొనసాగిస్తూనే ఉన్నాయి.దీని భారిన పడకుండా ఉండటానికి నిపుణనులు, వైద్యులు ఎల్లప్పుడూ ప్రజలను సూచనలనిస్తూనే ఉన్నారు.

 The Mask Is Priced At Rs 11 Crore,corona Virus Mask,rs.11 Crore ,israel ,gold ,d-TeluguStop.com

కాని ఎన్ని చర్యలు పాటించినా కరోనా విజృంబనను మాత్రం ఆపలేకపోతున్నారు.ఇదిలా ఉంటే కరోనాను అంతమొందించడానికి నిరంతరాయంగా వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.

వచ్చే ఏడాదికల్లా టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.అయితే అప్పటి దాకా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కరోనా సోకకుండా జగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

దీంట్లో భాగంగానే మాస్క్ లు, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్స్ ను పాటించాలని హెచ్చిరిస్తున్నారు.మరీ ముఖ్యంగా బయటకు వెళ్లినట్టయితే ఖచ్చితంగా మాస్క్ ను తప్పనిసరిగి ధరించాలని సూచిస్తున్నారు.

కాగా కరోనా వైరస్ వలన ప్రజలకు ముందున్న భయం రానురాను లేకుండా పోతోంది.విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ తిరేగేస్తూ కాలం గడుపుతున్నారు.ముఖానికి మాస్క్ లు లేకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా తిరుగుతున్నారు.దాంతో ప్రభుత్వాలు రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

అందుకే కొన్ని ప్రాంతాల్లో మళ్లీ లాక్ డౌన్ ఏర్పాటు చేస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నారు.దీనితో పాటుగా కర్ఫూ కూడా విధిస్తున్నారు.

పాటల రూపంలో, ప్రసంగాల రూపాల్లో కరోనా వల్ల వచ్చే నష్టాలను ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్నారు.దీనిలో భాగంగానే కరోనా నుంచి మనల్ని రక్షించే మాస్క్ గురించి కూడా నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు.

కాగా మాస్క్ ల మూలంగా చాలా మటుకు కరోనా నుంచి తప్పించుకోవచ్చు.అయితే వివిధ రకాల మాస్క్ లు కూడా మార్కెట్ దర్శనమిస్తున్నాయి.ఈ మాస్కుల ధర ఎంతుంటుంది అంటే మీరెంచెబుతారు.మహా అయితే బట్ట మాస్కులకు వందల నుంచి వేల దాకా అని, వెండి లేదా బంగారు మాస్క్ లకు లక్షల్లో ఉంటుందని చెబుతారు.

కాని మన అంచనాలకు మించి ఒక మాస్క్ ధర కోట్లల్లో పలుకుతుందండోయ్… అయ్యబాబోయ్ కోట్లే… అని అనుకుంటున్నారా.అవునండి మీరు చదివింది నిజంగా నిజమండి బాబోయ్.ఇజ్రాయెల్ కు చెందిన ఒక ఖరీదైన ఆభరణాల తయారీ సంస్థ యెవెల్ ఈ రూ.11 కోట్ల మాస్క్ ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.అమ్మో దీని ఖరీదు చూస్తుంటే ప్రపంచంలో అత్యంత ఖరీదైన మాస్క్ ఏదంటే ఇదేనేమో అనుకుంటారు కాబోలు.అయితే అమెరికా ఎఫ్ డీఏ ప్రమాణాలను అనుసరించి ఈ మాస్క్ ను తయారు చేశారు.

ఇందులో 250 గ్రాముల బంగారం, 3608 నలుపు, తెలుపు వజ్రాలతో దీనిని తయారు చేశారు.అందుకేనేమో దీనికి ఇంత ఖరీదు పలుకుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube