నెటిజన్లను ఫిదా చేస్తున్న పుష్ప 'శ్రీవల్లి' మరాఠి వెర్షన్.. నెట్టింట్లో వైరల్!

The Marathi Version Of Pushpa Srivalli Is Viral On Social Media

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం పుష్ప.ఈ సినిమా భారీ అంచనాల నడుమ గత ఏడాది డిసెంబర్ 17న రిలీజ్ అయిన విషయం అందరికి తెలిసిందే.

 The Marathi Version Of Pushpa Srivalli Is Viral On Social Media-TeluguStop.com

ఈ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.సినిమా విడుదల అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ థియేటర్లలో ప్రసారం అవుతూ వసూళ్లు సాధిస్తోంది.

 The Marathi Version Of Pushpa Srivalli Is Viral On Social Media-నెటిజన్లను ఫిదా చేస్తున్న పుష్ప శ్రీవల్లి’ మరాఠి వెర్షన్.. నెట్టింట్లో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో నటీనటులు నటనకుగాను అన్ని ఇండస్ట్రీల వారి నుంచి ప్రశంసలు అందుకున్నారు.సినిమాలో పాటల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎందుకంటే ఈ సినిమాలోని ప్రతి ఒక్క పాట కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.ఇక ఇందులో శ్రీవల్లి పాట, ఊ అంటావా మావా, సామి సామి అన్న పాటలు ఎక్కడ చూసినా కూడా మార్మోగి పోతున్నాయి.

అంతేకాకుండా ఈ మూడు పాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.ఇదిలా ఉంటే ఈ సినిమాలోనే శ్రీవల్లి పాటను తాజాగా పుణేకు చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ మరాఠీ వర్షన్ ను పాడారు.

కానిస్టేబుల్ కు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం.అలా తనకు నచ్చిన సినిమా పాటలను సొంతంగా పాడి యూట్యూబ్ ఛానల్ షేర్ చేస్తూ ఉంటాడు.ఇక తాజాగా హిందీలో కూడా సూపర్ హిట్ అయినా శ్రీవల్లి సాంగును మరాటి వర్షన్ లో కూడా పాడి డాన్స్ కూడా చేసి అదరగొట్టేశాడు.ఆ కానిస్టేబుల్ పేరు ఆటిష్ ఖరాడే.

ఇక ఆ కానిస్టేబుల్ పాడిన పాటకు, డాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ సాంగుకు ఇప్పటివరకు యూట్యూబ్ లో 17 మిలియన్ వ్యూస్ వచ్చాయి.ఆ కానిస్టేబుల్ మరాటి వర్షన్ లో పాడిన పాట శ్రీవల్లి సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది.

#Rashmika #Pushpa #Pushpa #Aatish Kharade #Samantha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube