పెసరపప్పు తో ఇలా చేస్తే...ఎంత పెద్ద జ్వరమైన ఇట్టే తగ్గిపోతుంది.! ట్రై చేయండి!

జ్వరం రాగానే 98.6 F గా ఉండే బాడీ టెంపరేచర్ క్రమంగా 103 F వరకు వెళుతుంది .జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.ఏం తినాలనిపించదు, నోరంతా చేదు చేదుగా ఉంటుంది.

 The Many Benefits Of Moong Dal-TeluguStop.com

మైండ్ స్తబ్దుగా మారి నీరసంతో నిద్ర ఆవహిస్తుంది.అయితే జ్వరాన్ని తగ్గించాలంటే…ముందుగా టెంపరేచర్ ను కంట్రోల్ చేయాలి.

అమాంతం పెరిగిపోయిన టెంపరేచర్ ను నార్మల్ లెవల్ కు తీసుకువస్తే…జ్వరాన్ని తగ్గించినట్టే.! అందుకోసం ఓ చిన్న చిట్కాను పాటిస్తే చాలు.!

ఓ కప్పు పెసరపప్పును తీసుకొని, దానిని ఓ సారి కడిగి, ఓ గిన్నె నిండా నీళ్లు పోసి అందులో పెసరపప్పును ఓ 20 నిమిషాలు నానబెట్టాలి.20 నిమిషాల తర్వాత ఆ పెసరపప్పు కడిగిన నీళ్లను ఓ గ్లాస్ లో పోసి జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి తాపించాలి.జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి…ఈ నీటిని తాగిన 10 నిమిషాల్లో అతని బాడీ టెంపరేచర్ క్రమంగా తగ్గుకుంటూ వస్తుంది.ఓ 20 నిమిషాల తర్వాత అతడు సాధారణ స్థితికి చేరుకుంటాడు.

అప్పటి వరకు చేదుగా ఉన్న అతని నోరు…ఇప్పుడు కాసింత దారిలోకి వస్తుంది.ఆ సమయంలో తేలికగా జీర్ణమయ్యే పదార్థాలను తినిపించాలి.

దీనితో పాటు డాక్టర్ ఇచ్చిన మందులను వాడుతుండాలి.

పెసరపప్పు లో వేడిని తగ్గించే అద్భుతమైన గుణాలున్నాయి, ఓ 20 నిమిషాల నానబెట్టడం వల్ల ఆ గుణాన్ని ఆ నీటికి సంక్రమింపజేస్తుంది పెసరపప్పు.

అంతే కాదు పెసలలో విటమిన్ బి, విటమిన్ సి, మాంగనీస్ తోపాటు ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.సూర్యుని నుంచి వచ్చే అతినీలిలోహిత కిరణాలు, పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యల నుండి కూడా కాపాడే శక్తి పెసళ్లకు ఉంది.

పెసళ్లను మన ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ఉత్తమం.వేడి ఎక్కువగా ఉండే వాళ్లకు ఈ పెసరపప్పు ఓ వరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube