“మనబడి” 10 వేల మంది విధ్యార్ధులతో రికార్డ్..     2018-09-19   15:57:11  IST  Bhanu C

తెలుగు నేలపైన తెలుగు అంతరించి పోతున్న సమయంలో విదేశీ గడ్డపై నివసిస్తున తెలుగు వారు అందరూ వారి వారి పిల్లలకి తెలుగు నేర్పించాలనే కాంక్ష ఎంతో సంతోషమైన విషయం..అయితే అలంటి వారికోసం అమెరికాలో ఏర్పాటు చేసిందే సిలికానాంధ్ర మనబడి..ఎంతో కాలంగా విదేశాలలో ఉంటున్న తెలుగు వారికోసం మనబడులని స్థాపించి తెలుగు నేర్పటం కోసం కృషి చేస్తున్న సిలికానాంధ్ర మనబడి సొంతం అని అధ్యక్షులు రాజు చమర్తి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మరింతగా తమ సెవలని విసృతం చేశారు..

అందులో భాగంగానే ఒక్క అమెరికాలోనే 35 రాష్ట్రాల్లో దాదాపు 10 వేల మందికి పైగా విద్యార్థులతో ఈ తరగతులు ప్రారంభించి రికార్డ్ సృష్టించారు..అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా భారత ఉప రాష్ట్రపతి తెలుగు బాషాభిమాని వెంకయ్య నాయుడు విచ్చేశారు..ఈ విద్యా సంవత్సరం వెంకయ్య నాయుడు చేతులమీదుగా ప్రారంభించారు మనబడి నిర్వాహకులు..ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం తనకు ఎంతగానో ఆనందాన్ని కలిగించిందన్నారు.

అయితే ఈ మనబడి కి తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో పాటు, ప్రతిష్టాత్మక (WASC)వాస్క్ ఎక్రిడిటేషన్, పలు స్కూల్ డిస్ట్రిక్ట్‌లలో ఫారిన్ లాంగ్వేజ్ గుర్తింపు కూడా ఉందని చామర్తి తెలిపారు..దాదాపు 11 ఏళ్లుగా మనబడి ద్వారా 45000 మందికి పైగా పిల్లలకు తెలుగు నేర్పించామని ఆయన వివరించారు.. అయితే సిలికానాంధ్ర మనబడి 2018-19 విద్యా సంవత్సరంలో ప్రవేశం పొందాలనుకుంటున్న వారు వెంటనే manabadi.siliconandhra.org ద్వారా ఈ నెల 21వ తేదీలోగా నమోదు చేసుకోవాలన్నారు. అంతేకాదు 1-844-626-2234 నెంబర్‌కు కాల్ చేయడం ద్వారా కూడా ప్రవేశం పొందొచ్చని మనబడి ఉపాద్యక్షులు దీనబాబు కొండుభట్ల తెలిపారు.