త‌ల‌పై 735 గుడ్ల‌తో రికార్డు సృష్టించిన వ్య‌క్తి..

గుడ్లు ఎంత జాగ్ర‌త్త‌గా ప‌ట్టుకుంటే అంత బాగుంటాయి.ఏ మాత్రం పొర‌పాటున గ‌ట్టిగా ప‌ట్టుకున్నా ప‌గిలిపోతుంటాయి.

 The Man Who Set The Record With 735 Eggs On The Head-TeluguStop.com

అంతెందుకు వాటిని షాప్‌ నుంచి జాగ్ర‌త్త‌గా ప‌గ‌ల కుండా ఇంటికి తేవ‌డ‌మే మ‌న‌కు పెద్ద టాస్క్‌లా అనిపిస్తుంది.ఎంత చిన్న రాయిలాంటిది త‌గిలినా ప‌గిలిపోయే గుడ్ల విష‌యంలో ఇప్ప‌టికే చాలామంది చాలా ర‌కాల ప్ర‌యోగాలు చేశారు.

కొంద‌రు వీటితో రికార్డులు కూడా క్రియేట్ చేశారు.వాటిని చేతిలో ప‌ట్టుకుని టిన్నుల‌ను కూడా ప‌గ‌ల‌గొట్టే గిన్నీస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డుల‌ను క్రియేట్ చేసిన ఘ‌ట‌న‌లు కూడా చూశాం.

 The Man Who Set The Record With 735 Eggs On The Head-త‌ల‌పై 735 గుడ్ల‌తో రికార్డు సృష్టించిన వ్య‌క్తి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఇప్పుడు ఓ డిఫ‌రెంట్ వ‌ర‌ల్డ్ రికార్డ్ వీడియో ఒక‌టి నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అయిపోయింది.ఇందులో ఓ వ్య‌క్తి దాదాపుగా 735 గుడ్లను త‌న మీద పెట్టుకునే టోపీపై నిల‌బెట్టి ఒక్క‌టి కూడా పగిలిపోకుండా చూస్తూ అద్భ‌త‌ర‌ప‌రిచాడు.

ఇది చూసిన వారంతా కూడా ఔరా అనిపించేలా అత‌ని విన్యాసం ఉంది.అ అద్భుత‌మైన టాలెంట్‌తో ఏకంగా అత‌గాడు ప్రపంచ రికార్డు సృష్టించాడు.ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఇందులో ఆఫ్రికాలోని కేప్‌ టౌన్ ప్రాంతంలో నివ‌సించే గ్రెగరీ దా సిల్వా చేసిన ఫీట్ ఇది.

ఇత‌టాగు ఎప్ప‌టి నుంచో ఎగ్‌ మ్యాన్ గా బాగా పాపుల‌ర్ అయిపోయాడు.ఇప్ప‌టికే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఇలా గుడ్ల‌తో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌లుచేసి రికార్డులు నెల‌కొల్పాడు.

ఇప్పుడు మ‌రో అడుగు ముంద‌కు వేసి టోపీపై ఏకంగా 735 గుడ్లను అతికించి వాటిని చైనాలో సీసీటీవీ ఛానెల్ వేదిక‌గా ప్ర‌ద‌ర్శ‌న చేసి మ‌రీ గిన్నీస్ రికార్డు నెల‌కొల్పాడు.అన్ని గుడ్ల‌లో ఒక్క‌టి కూడా ప‌గిలిపోకుండా ప్రదర్శించాడు గ్రెగరీ.

అత‌ని ట్యాలెంట్ చూసిన వారంతా కూడా షాక్ అయిపోతున్నారు.ఇప్ప‌టి దాకా ఇన్ని గుడ్ల‌తో ఎవ‌రూ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేద‌ని చెబుతున్నారు.

#Ginnise #Egg

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు