పాన్ అమ్మే వ్యక్తికి.. ఒంటి నిండా బంగారమే!

అతడు అందరిలాగానే పాన్ అమ్ముతాడు.అయితే అతడి ఆలోచనలు మాత్రం విభిన్నంగా ఉన్నాయి.

 The Man Who Sells The Pan Is Full Of Shit And Gold Pan Men, Selling, Gold, Viral-TeluguStop.com

ఇతరులలా కాకుండా వైవిధ్యంగా ఆలోచించాడు.కొన్నేళ్ల తన కలలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకున్నాడు.

తన తాతల కాలం నాటి వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు.ఈ క్రమంలో తన ఒంటి నిండి బంగారం ధరిస్తూ, ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాడు.

తమ వద్ద పాన్‌ను మాజీ ఉపరాష్ట్రపతులు సైతం రుచి చూశారని గర్వంగా చెబుతున్నాడు.అతడిని చూడాలని కూడా చాలా మంది అక్కడికి వస్తుంటారు.

అంతలా అతడు ప్రాచుర్యం పొందాడు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

రాజస్థాన్‌ రాష్ట్రం భికనీర్‌కు చెందిన ఫూల్‌చంద్ సేవగ్ (62)ది పేద కుటుంబం.అయినప్పటికీ తన నేపథ్యం వల్ల అతడు ఎప్పుడూ బాధ పడలేదు.అతడు తన తాతల కాలం నుంచి, అంటే 72 ఏళ్ల క్రితం ప్రారంభించిన పాన్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు.తాను వ్యాపారం మొదలు పెట్టినప్పటి నుంచి అతడికి ఓ కోరిక ఉండేది.

బంగారం కొనుక్కోవాలని అనుకున్నాడు.తన వ్యాపారం అంతంత మాత్రమే.

చివరికి ఏడాది పొడవునా తాను దాచుకున్న డబ్బులతో ఒక్కో బంగారు ఆభరణాన్ని కొంటూ వచ్చాడు.అందరిలా వాటిని ఇంట్లో దాచుకోకుండా ఒంటిపై ధరించేవాడు.చేతికి కంకణం, మెడలో గొలుసు, చెవులకు జుంకాలు ఇలా తన ఒంటిపై రూ.20 లక్షల విలువైన బంగారం సమకూర్చుకున్నాడు.

Telugu Gold, Gold Lovers, Pan, Latest-Latest News - Telugu

అవి ధరించే తన వ్యాపారం కొనసాగిస్తున్నాడు.తన తాతల కాలం నాటి ఈ వ్యాపారాన్ని అంచెలంచెలుగా పెంచేశాడు.ఎంతలా అంటే అతడిని చూసేందుకే చాలా మంది వస్తుంటారు.ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు అతడి వద్ద పాన్ కొనుక్కుని తీసుకెళ్తుంటారు.ఇక్కడి నుంచి బంధువుల ఇంటికి వెళ్లే వారు కూడా పాన్ ప్యాక్ చేయించుకుంటారు.మాజీ ఉపరాష్ట్రపతి మాజీ ఉపరాష్ట్రపతి భైరాన్ సింగ్ షెకావత్ తన పాన్‌ను తిన్నారని ఆయన గర్వంగా చెబుతున్నాడు.

ఇక స్థానికంగా ఎంతో పేరొందిన ఇతడితో చాలా మంది ఉత్సాహంగా సెల్ఫీలు దిగుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube