కింగ్ కోబ్రాని కాపాడిన వ్యక్తి... వీడియో వైరల్

సాధారణంగా చాలామంది చిన్న పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరుగెత్తి భయంతో వణికిపోతారు.ఇంకాస్త పెద్ద పాము కనబడితే ఎమన్నా ఉందా.

 The Man Who Saved King Cobra The Video Went Viral , King Kobra, Viral Latest-TeluguStop.com

వెన్నులో వణుకు పుట్టి ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి.అయితే ఓ వ్యక్తి మాత్రం కళ్లముందు భారీ కింగ్ కోబ్రా ఉన్నా.

కొంచెం కూడా భయపడలేదు.అది చాలా ప్రమాదకరమే కాకుండా అత్యంత విషపూరితమైనదని తెలిసినా.

భయపడకుండా దాన్ని రక్షించాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే. చేపల కోసం మత్స్యకారులు వలను ఏర్పాటు చేశారు.అయితే ఆ చేపల వలలోకి అనుకోకుండా ఓ కింగ్ కోబ్రా వచ్చి చిక్కుకుపోయింది.ఆ వలలో నుండి బయటకు రాలేక నానా అవస్థలు పడుతుంది.

ఇది గమనించిన ఓ వ్యక్తి ఏ మాత్రం భయపడకుండా దాని దగ్గరకు వెళ్లి వలను క‌త్తెర‌తో క‌త్తిరించి ఆ కోబ్రాను రక్షించాడు.అనంతరం దాహంతో ఉన్న కోబ్రాకు వాట‌ర్ బాటిల్‌తో నీళ్లు తాగిస్తాడు.

చివ‌ర‌గా, కోబ్రాను ర‌క్షించి సుర‌క్షిత ప్రాంతంలో వ‌దిలిపెడతాడు.

ఈ వీడియోను మిర్జా ఎండీ ఆరిఫ్ అనే యూ ట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేశారు.

ఈ వీడియోను ఒడిశాలో షూట్ చేశారు.ఈ వీడియో నెటిజ‌న్ల మ‌న‌సు గెలుచుకుంది.

ఈ వీడియోపై పలువురు నెటిజన్లు తమదైన శ్రేణిలో కామెంట్స్ చేస్తున్నారు.మీ ధైర్యానికి జోహార్లు అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.

రక్షించడమే కాకుండా నీరు తాగించిన మీ దయా హృదయానికి హ్యాట్సాఫ్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube