స్టాక్ మార్కెట్ స్టైల్ లో వెడ్డింగ్ కార్డు ముద్రించిన వ‌రుడు..

The Man Who Printed The Wedding Card In Stock Market Style

ఒక్కొక్క‌రి లోచ‌న‌లు ఒక్కో విధంగా ఉంటాయి.వారు అనుస‌రించే విధానాలు వారిని న‌లుగురిలో ప్ర‌త్యేకంగా ఉంచుతాయి.

 The Man Who Printed The Wedding Card In Stock Market Style-TeluguStop.com

అంద‌రూ చేసే విధంగా చేస్తే కిక్ ఏముంటుంద‌ని వారు చెప్తుంటారు.అందుకే అంద‌రికంటే కొంచెం డిఫ‌రెంట్‌గా ఉండేందుకు ప్లాన్ చేసుకుంటారు.

ఇక వీరు త‌మ జీవితంలో జ‌రిగే కీల‌కమైన ఘ‌ట్టాల‌ను కూడా ఇలాగే డిఫ‌రెంట్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు.ఇక పెళ్ళి విష‌యంలో కూడా ఇలాంటివే వారు ఫాలో అవుతుంటారు.

 The Man Who Printed The Wedding Card In Stock Market Style-స్టాక్ మార్కెట్ స్టైల్ లో వెడ్డింగ్ కార్డు ముద్రించిన వ‌రుడు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు కూడా ఇలాంటిదే వైర‌ల్ అవుతోంది.అది కూడా వెడ్డింగ్ కార్డుకు సంబంధించింది.

మొన్న‌టికి మొన్న ఓ వ్య‌క్తి కూడా ఇలాగే త‌న పెళ్ళి వెడ్డింగ్ కార్డును రాజ్యాంగ హ‌క్కుల‌తో ముద్రించడంతో అది కాస్తా నెట్టింట్లో ఎంత‌లా వైర‌ల్ అయిపోయిందో అంద‌రం చూశాం.ఇప్పుడు  ఓ వ్య‌క్తి త‌న పెళ్ళి కార్డును స్టాక్మార్కెట్‌ టర్మినాలజీలో ముద్రించేసి ట్రెండింగ్ అయిపోయాడు.

కాగా మ‌హారాష్ట్ర‌కు చెందిన సందేశ్ కు స్టాక్ మార్కెట్ చేయ‌డం అంటే చాలా ఇష్టం.అత‌ను డాక్టర్‌ దివ్యని పెళ్ళి చేసుకోబోతున్నాడు.

కాగా త‌న వెడ్డింగ్ కార్డును స్పెష‌ల్ గా ముద్రించాల‌ని అనుకున్నాడు.వెంట‌నే దాన్ని ఇన్షియల్‌ పబ్లిక​ ఆఫర్ గా తెలిపాడు.

Telugu Divya, Maharashtra, Sandesh, Stock Exchange, Stock, Variety-Latest News - Telugu

అంతే కాదు వరుడు, వధువుల పేర్ల‌ను నేరుగా చెప్ప‌కుండా ఇరువురిని రెండు కంపెనీలుగా పేర్కొన్నాడు.ఇక ఈ రెండు కంపెనీల‌ను క‌లిపేందుకు ప్రమోటర్లు ముందుకు రావ‌డంతో మెర్జ్‌ జరుగుతోందంటూ అందులో వివ‌రించాడు.ఇక పెళ్లి మంట‌పాన్ని స్టాక్‌ ఏక్స్చేంజీగా అలాగే ఆహ్వానితుల‌ను ఇన్వెస్టర్ల హోదాగా తెలిపాడు.ఇలా ప్ర‌తి విష‌యాన్ని కూడా ఏదో ఒక బిజినెస్ స్టైల్ లో తీర్చి దిద్దాడు.

దీంతో ఈ వెడ్డింగ్ కార్డు కాస్తా నెట్టింట్లో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.దాన్ని చూసిన వారంతా కూడా ఇదేం స్టైల్ బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

#Divya #Maharashtra #Variety #Stock #Sandesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube