మేక కోసం బోరు బావిలోకి దిగిన వ్య‌క్తి.. చివ‌ర‌కు

ఇప్ప‌టి కాలం ఎలా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.సాటి మ‌నిషి ఎంత‌టి క‌ష్టాల్లో ఉన్నా స‌రే ప‌ట్టించుకోరు.

 The Man Who Landed In The Bore Well For The Goat To The End Details, Goat, Viral-TeluguStop.com

త‌మ‌కు అవ‌స‌రం ఉంటే త‌ప్ప ఎవ‌రితోనూ పెద్ద‌గా మాట్లాడ‌టానికి కూడా ఇష్ట‌ప‌డ‌రు.ఇలాంటి కాలంలో మాన‌వ‌త్వం అనేది ఎక్క‌డైనా ఉందా అనే అనుమానాలు కూడా క‌లుగుతున్నాయి.

అయితే ఇలాంటి నేప‌థ్యంలో కూడా చాలామంది త‌మ మంచి త‌నంతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నారు.మొన్న‌టికి మొన్న ఓ చిన్నారి ఇలాగే కారును ఆపి మ‌రీ ఓ ప్రెగ్నెంట్ లేడీని ఆదుకున్న ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను చూశాం.

అలాగే ఇప్పుడు కూడా ఓ వ్య‌క్తి ఇలాంటి ప‌నే చేసి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు.ఇవాళ్ల రేపు మ‌నుషుల‌ను కూడా ప‌ట్టించుకోని ఈ కాలంలో మేక ప్రాణాలు కాపాడేందుకు త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టాడు ఓ వ్య‌క్తి.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్ప‌డు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.ఇందులో ఓ మేక పొర‌పాటున వ్యవసాయ క్షేత్రంలో ఉన్న బోరు బావిలో ప‌డిపోయింది.

అయితే ఎంత ప్ర‌య‌త్నించినా అది బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో దాని అరుపులు ద‌గ్గ‌ర‌లో ఉన్న ఓ వ్య‌క్తి విన్నాడు.దీంతో అత‌ను అందులోకి దిగేందుకు సిద్ధం అయ్యాడు.

త‌న స్నేహితుల సాయంతో అందులోకి దిగేందుకు రెడీ అయిపోయాడు.స్నేహితులు అత‌ని కాళ్లు పట్టుకోవ‌డంతో అత‌ను నెమ్మ‌దిగా చేతులు అందులోకి పెట్టి దిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు.ఇక అతి క‌ష్టం మీద అత‌ను ఆ మేక పిల్ల‌ను చేజిక్కించుకుని పైకి తీసేందుకు ప్ర‌య‌త్నించాడు.చివ‌ర‌కు అనుకున్న‌ది సాధించాడు.అత‌ని స్నేహితులు, అత‌ను క‌లిసి చేసిన ప‌ని అంద‌రినీ ఆనందానికి గురి చేసింది.ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.

దీన్ని చూసిన వారంతా కూడా వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube