చేపలు పట్టడానికి యంత్రాన్ని కనిపెట్టిన వ్యక్తి... చదువుకున్నది 4వ తరగతి మాత్రమే!

మీకు తెలిసిన, మీ చుట్టూ వున్న ఎలిమెంటరీ చదువులు చదివేసి తరువాత మానేసిన వారిని గమనిస్తే ఏం తెలుస్తుంది.అలాంటివారు బతకడానికి ఏదోఒక చిన్న పని చేసుకొని పొట్ట నింపుకుంటూ వుంటారు కదూ.

 The Man Who Invented The Fishing Machine Had Only A 4th Grade Education ,fishing-TeluguStop.com

చదువుకున్నోళ్ళే ఏదైనా చేయగలరు, మనమేం చేయగలంలే అనుకొని జీవితాన్ని భారంగా వెల్లడిస్తారు కదూ.అయితే అతగాడు అలా చేయలేదు.కృషి ఉంటే మనుషులు.ఋషులు అవుతారు అనే మాట వాస్తవం చేస్తూ.తన టాలెంట్​ కి పదును పెట్టాడు.టాలెంట్ ఉండాలేగాని పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన పనిలేదు.

అని నిరూపించాడు, ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.

అవును, ఈ క్రమంలో నలుగురికి ఉపాధిని కూడా కల్పించాడు.

విషయంలోకి వెళితే, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన ముక్కెర చంద్రశేఖర్ చిన్ననాటి నుంచే ఎలక్ట్రిషియన్.స్వతహాగా టీవీల మరమ్మతులు చేస్తుంటాడు.

Telugu Grade, Electrician, Machine, Latest-Latest News - Telugu

ఈ నేపథ్యంలో గ్రామాల్లో చేపలు పట్టేందుకు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకున్నాడు.ఇంకేముంది చేపలు పట్టడం కోసం ఏదన్నా పరికరం తయారు చేయాలనుకున్నాడు.అంతర్జాలాన్ని వేదికగా చేసుకొని.అందులో విభిన్న వీడియోలను చూస్తూ.తన ప్రతిభకు పదును పెట్టారు.

Telugu Grade, Electrician, Machine, Latest-Latest News - Telugu

ఈ నేపథ్యంలో బ్యాటరీ ద్వారా పనిచేసే ఓ పరికరాన్ని రూపొందించారు.పురుగు మందు పిచికారీ చేసే డబ్బాకు ఈ పరికరాన్ని అమర్చి, పరికరం ద్వారా వచ్చే తీగలను రెండు పొడవైన వెదురు పుల్లల ద్వారా నీటి ప్రవాహంలో ఉంచి నీటిలో చేపలను ‘బెల్ బటన్ సాయంతో మూర్చపోయేలా చేస్తాడు.పరికరాన్ని పట్టుకున్న వారు నీటిలోనే ఉన్నప్పటికి ఎలాంటి విద్యాదాఘాతానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.

దాదాపు రెండేళ్లపాటు అనేకసార్లు ప్రయోగించిన తర్వాత ఆ పరికరాన్ని ఉన్నతమైనదిగా మలిచాడు.కట్ చేస్తే ఆ ఊరిలోని రైతులు పెద్ద సమస్యగా అనుకున్న దానిని తేలికగా పరిస్కారం చేసి చూపాడు.

దాంతో స్థానికులు అతగాడిని హీరోలా చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube