వైరల్: ఎలుకను పాముకి ఆహారంగా తినిపిస్తున్న వ్యక్తి..!

ఈ మధ్య సోషల్ మీడియాలో జంతువులకు సంబందించిన వీడియోలు బాగా పాపులర్ అవుతున్నాయి.నెటిజన్లు కూడా జంతువుల వీడియోలను బాగా వైరల్ చేస్తూ ఉన్నారు.

 The Man Who Feeds The Rat To The Snake Viral  Latest, News Viral, Video Viral, S-TeluguStop.com

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ పాము వీడియో ఒకటి బాగా హల్ చల్ చేస్తుంది.నిజానికి పాము పేరు వింటేనే అందరు కూడా భయపడిపోతారు.

ఎందుకంటే పాము కాటు వేస్తే మనిషి ప్రాణాలు సైతం పోతాయి.అలాంటి పాముకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు చూడాలంటే చాలా మంది ఇష్టపడరు.

అయితే ఈ మధ్య పాములకు సంబంధించిన వీడియోలు కూడా బాగానే వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఈ పాము వీడియో చూస్తే అందరు ఆశ్చర్య పోతారు.

సాధరణంగా పాములు చిన్నా చితకా కీటకాలు, జంతువులను తిని జీవనం సాగిస్తాయి.ఆ జంతువులలో ఎలుక కూడా ఒకటి.ఎలుకను చూస్తే పాముకు పండగే.ఆరోజు ఇక పాముకు భోజనం దోరికినట్లే.

అయితే ఈ వీడియోలో ఒక వ్యక్తి అసలు పాము అంటే భయం లేకుండా దాని చేతిలో పట్టుకోవడం కొంచం షాక్ అయ్యే దృశ్యమే.అలాగే ఇంకొక చేతిలో ఒక ఎలుకను కూడా పట్టుకుంటాడు.

మరి ఈ ఎలక ప్రాణాలతో ఉందో లేక చనిపోయిందో అనే విషయం మాత్రం క్లారిటీ లేదు.ఇలా ఆ వ్యక్తి ఒక చేత్తో ఎలుకను, మరొక చేతితో పామును పట్టుకుని ఉండడం నెటిజన్లకు షాక్ అనిపించింది.

మొదట అలా ఎందుకు పట్టుకున్నాడు అని అందరూ ఆలోచనలో పడ్డారు.ఆ తరువాత మెల్లగా ఎలుకను పట్టుకున్న చేతిని, మరొక చేతిలో పట్టుకున్న పాము నోటి దగ్గరకు తీసుకుని వస్తాడు.

ఎలుకను చూసిన పాము ఉరికనే ఉంటుందా చెప్పండి.అమాంతం ఆ పాము ఎలుకను నోటితో పట్టేసుకుంది.అయితే ఈ పాము ఒక్కసారిగా ఎలుకను మింగకుండా నోటిలో ఉంచడం వీడియోలో చూడవచ్చు.ప్రస్తుతం ఈ పాము ఎలుక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో పాటు చూసిన ప్రతి ఒక్కరు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. పొద్దునే లేచి ఎలుక ఎవరి ముఖం చూసిందో ఏంటో పాపం పాముకు ఆహారంగా మారిపోయిందని ఒకరు అంటుంటే.

, మరొకరు ఇలా కావాలని ఎలుకను పాముకు తినిపించడం సరికాదని మరికొంతమంది కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube