వ‌ధువును అలా చూసి క‌న్నీళ్లు పెట్టుకున్న వ‌రుడు.. నెటిజ‌న్లు ఏమ‌న్నారంటే

The Man Who Cried When He Saw The Bride Like That What Do The Netizens Say

పెండ్లి అనేది ప్ర‌తి ఒక్కరి జీవితంలో ఎంతో మ‌ధుర‌మైన క్ష‌ణం అనే చెప్పొచ్చు.దీన్ని ఆస్వాదించేందుకు ప్ర‌తి ఒక్క యువ జంట ఎంత‌గానో ఆతృత‌గా ఎదురు చూస్తుంది.

 The Man Who Cried When He Saw The Bride Like That What Do The Netizens Say-TeluguStop.com

అయితే కాలం మారుతున్నా కొద్దీ పెండ్లిలో కూడా అనేక మార్పులు వ‌స్తున్నాయ‌న్న సంగ‌తి తెలిసిందే.పెండ్లి అంటే ఇంత‌కు ముందు చాలా ప‌ట్టింపుల‌తో నిర్వ‌హించేవారు.

కానీ ఇప్పుడు హంగులు, ఆర్బాటాలు ఎక్కువ‌యిపోయాయి.చాలా ర‌కాల మార్పులు వ‌చ్చేశాయి.

 The Man Who Cried When He Saw The Bride Like That What Do The Netizens Say-వ‌ధువును అలా చూసి క‌న్నీళ్లు పెట్టుకున్న వ‌రుడు.. నెటిజ‌న్లు ఏమ‌న్నారంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే పెండ్లికి సంబంధించిన ఏదో ఒక వీడియో నెట్టింట వైర‌ల్ అవుతూనే ఉంది.

ఈ మ‌ధ్య‌ మ‌రీ ఎక్కువ‌గా డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు బాగా పాపుల‌ర్ అవుతున్నాయి.

ఏ పెళ్లి అయినా ఇలా డ్యాన్స్ చేయ‌డం మాత్రం చాలా కామ‌న్ అయిపోయింది.ఇంకొన్ని సార్లు ఇత‌ర ఘ‌ట‌న‌లు బాగా వైర‌ల్ అవుతున్నాయి.

అయితే ఇప్పుడు కూడా ఓ వీడియో బాగా వైర‌ల్ అవుతోంది.కాకపోతే అది మాత్రం డ్యాన్స్ కు సంబంధించింది కాదు.

భావోద్వేగానికి సంబంధించింది.ఇందులో వ‌రుడు తీవ్రంగా ఏడ్చేయ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.అయితే అత‌ను ఏడుస్తుంది బాధ‌తో కాదండోయ్ ఆనందంతో.అది కూడా త‌న భార్య‌ను చూసి.

అదేంటి భార్య‌ను చూసి ఎందుకు ఏడుస్తున్నాడ‌నుకుంటున్నారా.ఈ వీడియోలో వ‌ధువు అయిన అలెగ్జాండ్రియాను ఒక్క సారిగా పెండ్లి కూతురు గెట‌ప్ లో చూసే స‌రికి వరుడు డెమెట్రియస్‌ క్యాషరీస్ ఒక్క సారిగా భావోద్వేగానికి గుర‌య్యాడు.వ‌ధువు వైట్ క‌ల‌ర్ గౌనులో చేతిలో బొకే ప‌ట్టుకుని త‌న తండ్రితో క‌లిసి రావ‌డాన్ని చూసిన వ‌రుడు ఇలా ఒక్క‌సారిగా ఏడ్చేశాడు.దీన్నంతా కూడా కొంద‌రు వీడియో తీయ‌గా నెటిజ‌న్లు వారిని చూసి ల‌వ్ లీ క‌పుల్స్ అని కామెంట్లు పెట్టేస్తున్నారు.

వారికి అంద‌రూ విషెస్ తెలుపుతున్నారు.మ‌రి మీరు కూడా వీడియోను చూసేయండి.

#Groom Demetrius #Groom Cried #Alexandria #Groom

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube