గుడ్లతో అద్భుతం సృష్టించిన ఆ వ్యక్తి.. చక్కర్లు కొడుతున్న వీడియో!

సాధారణంగా మీరెన్ని గుడ్లను చేతిలో పట్టుకోగలరు? ఒక చేతితో గరిష్ఠంగా కోడి గుడ్డంత పరిమాణంలో ఉండే 4-5 గుడ్లను పట్టుకోవచ్చు.అంతకంటే ఎక్కువ గుడ్లను అరచేతిలో పట్టుకోవడం సాధ్యం కాదు కదా.

 The Man Who Created A Miracle With Eggs .eggs, New Record,wonder, Viral Latest V-TeluguStop.com

అయితే ఇరాక్ దేశానికి చెందిన ఒక వ్యక్తి మాత్రం అద్భుతం సృష్టించాడు.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 గుడ్లను ఒకే చేతిపై పట్టుకుని వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

ఇబ్రహీం అనే ఈ యువకుడు తన ఎడమ చేతిపై 18 గుడ్లను ఉంచి బ్యాలెన్స్ చేయగలిగాడు.ఎంతో ఓపిక, సాధన ఉంటేనే ఇలా చేయడం సాధ్యమవుతుంది.అయితే ఇతడి ప్రత్యేక ప్రతిభను గుర్తించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఫిదా అయిపోయారు.అతడు గుడ్లను బ్యాలెన్స్ చేసిన ఫీట్ కు సంబంధించిన వీడియోని ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.

దాంతో నెటిజన్లు అంతా ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియోకి ఇప్పటికే లక్షల వ్యూస్, వేలలో లైక్స్ వచ్చాయి.

వైరల్ అయిన వీడియోలో ఇబ్రహీం తన చేతిపై చాలా జాగ్రత్తగా 18 గుడ్లను పెట్టుకోవడం చూడొచ్చు.కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి తన టోపీపై ఏకంగా 735 గుడ్లు బ్యాలెన్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.

ఈ ఏడాది మే నెలలో జాక్ హరీస్ అనే ఒక వ్యక్తి తన చేతి వెనుక భాగంపై 18 గుడ్లను బ్యాలెన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు.

ఇదిలా ఉండగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రజలు చోటు దక్కించుకుంటున్నారు.ముక్కు అత్యంతగా పొడుగ్గా ఉన్నందుకు, తీవ్రమైన బాడీ మాడిఫికేషన్లు చేసుకున్నందుకు, 12 వేల మంది సంగీత కళాకారులతో అతిపెద్ద కచేరీ నిర్వహించినందుకు చాలామంది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చేరిపోయారు.భారతీయులు కూడా అబ్బురపరిచే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసి ఆశ్చర్యపరిచారు.

అతిపెద్ద లడ్డు, అతి పొడవైన గోర్లు, అతిపెద్ద తలపాగా, అతి పెద్ద మీసం, అతి తక్కువ వయస్సు గల మహిళ, అతిపెద్ద చపాతి, అత్యంత ఖరీదైన వెడ్డింగ్( లక్ష్మీ మిట్టల్ కూతురు వానిషా పెళ్లి) ఇలా అనేక విశేషాలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube