నిండు ప్రాణం బలితీసుకున్న ఫైనాన్స్.. ?

డబ్బులు లేక వచ్చే బాధను తీర్చుకోవడానికి ప్రైవేట్‌ ఫైనాన్స్‌ లను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతుంది.అయితే ఫైనాన్స్‌లో డబ్బులు తీసుక్నేటప్పుడు బాగానే ఉంటుంది.

 The Man Sacrificed His Life For Financial Harassment-TeluguStop.com

కానీ కట్టే సమయంలోనే ఎన్నో కష్టాలు చుట్టుముడుతున్నాయి.ఇలా ఈ ఫైనాన్స్ నిర్వాహకుల వేధింపులకు ఎందరో ప్రాణాలు తీసుకున్నారు.

వారి కుంటుంబాలను అనాధలుగా మార్చారు.అయితే ఇలాంటి మరో ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.

 The Man Sacrificed His Life For Financial Harassment-నిండు ప్రాణం బలితీసుకున్న ఫైనాన్స్.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ వివరాలు చూస్తే.

మాడ్గగులపల్లి మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన కొండేటి నాగయ్య (27) అనే యువకుడు ఇళ్లు కట్టుకోవడానికి సంవత్సరం క్రితం ఓ ప్రైవేట్ ఫైనాన్స్‌ నుంచి రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడట.అయితే కరోనా కారణంగా అప్పు తిరిగి చెల్లించడంలో ఆలస్యమైంది.

దీంతో ఫైనాన్స్‌కు సంబంధించిన ఏజెంట్లు నాగయ్య దగ్గరికి వచ్చి డబ్బులు చెల్లించకపోతే ఇంటికి తాళం వేస్తామని వేధించడం మొదలు పెట్టారట.అంతే కాకుండా తెలిసినవారి వద్ద నాగయ్య మరో రూ.2లక్షలు అప్పుగా తీసుకున్నాడట.

అయితే ఈ మొత్తం కట్టేపరిస్దితి లేకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న నాగయ్య, ముషంపల్లి రోడ్డులోని చర్చి వెనుకాల పురుగుల మందు తాగిన తర్వాత ఈ విషయాన్ని బంధువులకు తెలియచేశాడట.

కాగా వెంటనే బంధువులు ఘటనస్థలానికి చేరుకుని 108 లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే నాగయ్య మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారట.ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారట.

#Sacrificed Life #Nalgonda #Man Ded

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు