నయా ట్రెండ్ సెట్ చేసిన మలయాళ ముద్దుగుమ్మలు!

ఏ సినీ పరిశ్రమలో హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ.వరుస విజయాలు వస్తు ఉంటేనే హీరోయిన్స్ గా కెరీర్ కొనసాగుతుంది.

 Malayala Heroines Keerthy Suresh And Nayanthara Craze In Tollywood Details, Mala-TeluguStop.com

లేకుంటే కెరీర్ కి బ్రేకులు పడిపోయినట్టే.అయితే.

సక్సెస్ లు మాత్రమే ఉంటే సరిపోదు.కెరీర్ విషయంలో ఎలాంటి పొరపాట్లకి తావు ఇవ్వకూడదు.

ముఖ్యంగా అందాలను ఒలకబోయాడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి.డీ గ్లామరస్ రోల్స్ కి దూరంగా ఉండాలి.

అన్నిటికీ మించి.తన రేంజ్ ని తగ్గించుకునే క్యారెక్టర్స్ అస్సలు చేయకుడదు.

ఈ లెక్కలు అన్నీ తెలుసు కాబట్టే స్టార్ హీరోయిన్స్ ఎవ్వరు కూడా అక్క, చెల్లి పాత్రలు చేయడానికి సాహసించరు.అవకాశాలు లేకపోయినా పర్లేదు గాని.

, తమ క్రేజ్ ని పోగొట్టుకోవడానికి మాత్రం ఇష్టపడరు.అయితే.

, ఇద్దరు మలయాళ బ్యూటీస్ మాత్రం ఈ సెంటిమెంట్ కి బ్రేకులు వేసేశారు.కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే.

పెద్ద స్టార్స్ పక్కన సిస్టర్ రోల్స్ వేయడానికి కమిట్ అయిపోయారు.ఇంతకీ ఇంత దైర్యం చేసిన ఆ ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

ముందుగా ఈ విషయంలో చెప్పుకోవాల్సింది కీర్తి సురేశ్ గురించి.కీర్తి ఎన్ని సినిమాల్లో నటించినా., తెలుగు వారికి మాత్రం మహానటి సావిత్రి సినిమాలో ఆమె నటన మాత్రమే గుర్తు ఉండిపోతుంది.ఆ పాత్రకి ఆ స్థాయిలో ప్రాణం పోసి, తెలుగునాట అన్నీ వర్గాల ప్రేక్షకులకి దగ్గర అయ్యింది కీర్తి సురేష్.

ప్రస్తుతం కీర్తి సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన “సర్కారు వారి పాట”లో హీరోయిన్ గా నటిస్తోంది.

Telugu Bholaa Shankar, Chiranjeevi, Craze Tollywood, God, Keerthy Suresh, Keerth

ఇంత పెద్ద స్టార్స్ తో నటిస్తూ.కీర్తి చెల్లి పాత్రలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.
కీర్తి సురేష్ ఆల్రెడీ రజినీకాంత్ సిస్టర్ గా పరిచయం అయ్యింది.

దీపావళి రిలీజ్ అన్నాత్తే మూవీలో రజినీ ముద్దుల చెల్లిగా కీర్తి సురేష్ నటించారు.ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు.

కానీ., భారీ ఓపెనింగ్స్ అయితే సాధించగలిగింది.

కానీ., కీర్తి సురేశ్ మాత్రం రజినీ చెల్లిగా చేయడం అన్నది ఊహించని పరిణామం.

అలాగే చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీలో కూడా ఆమె చెల్లిగా కనిపించనున్నారు.

Telugu Bholaa Shankar, Chiranjeevi, Craze Tollywood, God, Keerthy Suresh, Keerth

ఇక ఈ విషయంలో తన జూనియర్ ని ఫాలో అయిపోతుంది నయనతార. సౌత్ సినీ ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్ అంటే ముందుగా నయనతార పేరే వినిపిస్తోంది.ఇంత క్రేజ్ ఉన్నా.

ఈ లేడీ సూపర్ స్టార్ చిరంజీవి చెల్లిగా నటించడానికి ఒప్పుకుని అందరికీ షాక్ ఇచ్చింది .నయనతార గాడ్ ఫాదర్ లో చెల్లి పాత్రకు సైన్ చేశారు.కానీ., కోస మెరుపు ఏమిటంటే ఇలాంటి పాత్రల్లో రిస్క్ చేసి నటిస్తున్నందుకు డబుల్ రెమ్యునరేషన్స్ దక్కించుకుంటున్నారట ఈ మలయాళ బ్యూటీలు.మరి.ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube