సీతారామం మరో డిలీట్ సీన్ రిలీజ్ చేసిన మేకర్స్.. వైరల్ అవుతున్న వీడియో!

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సినిమాలలో సీతారామం సినిమా ఒకటి.ఒక చిన్న సినిమాకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

 The Makers Released Another Deleted Scene Of Sitaram The Video Is Going Viral De-TeluguStop.com

వైజయంతి మూవీస్ బ్యానర్లో హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని.ఇలా అందమైన ప్రేమ కావ్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి.

ఇకపోతే ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాలు డిలీట్ చేసిన కొన్ని సన్నివేశాలను ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేశారు.కొన్నిసార్లు సినిమా నిడివి ఎక్కువగా ఉన్న సమయంలో ఇలా కొన్ని సన్నివేశాలను డిలీట్ చేస్తుంటారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో కూడా ఇదివరకే రష్మిక సీతామహాలక్ష్మి కోసం వెతుకుతూ వచ్చేటప్పుడు టాక్సీ డ్రైవర్ తో ఉన్నటువంటి సంభాషణకు సంబంధించిన వీడియో కూడా డిలీట్ చేశారు.ఇక ఈ వీడియో కనుక పెట్టి ఉంటే ఎంతో అద్భుతంగా ఉండేది అంటూ కామెంట్లు చేశారు.

ఇలా ఈ సినిమా కాకుండా తాజాగా మరొక డిలీట్ చేసిన సన్నివేశాన్ని కూడా మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇందులో క్లైమాక్స్ సన్నివేశంలో భాగంగా హీరో దుల్కర్ సల్మాన్, నటుడు సుమంత్ ఇద్దరిని పాక్ తమ అధీనంలో ఉంచుకున్నప్పుడు వీరిద్దరి మధ్య జరిగే ఒక ఎమోషనల్ సన్నివేశాన్ని తొలగించినట్టు తెలుస్తుంది.ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన అతి తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఇది చూసిన నెటిజన్ లు ఇలాంటి అద్భుతమైన ఎమోషనల్ సన్నివేశాన్ని ఎందుకు తొలగించారు.

ఈ సీన్ కనుక ఉంటే సినిమా మరో లెవెల్ లో ఉండేదని నేటిజన్ లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube