హెచ్‌1 బీ వీసా రిజెక్ట్ అవ్వడానికి 3 ముఖ్యమైన కారణాలు ఇవే..! అందుకే మనవాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతున్నారు.!  

The Main 3 Reasons For H-1 B Visa Rejection-h1-b Visa,how To Get H1-b Visa,nri,reasons For H-1 B Visa Rejection,telugu Nri News Updates

హెచ్‌1 బీ అనేది నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసా. అమెరికన్‌ కంపెనీలు విదేశీ నిపుణుల్ని పనిలో పెట్టుకోవడానికి ఉపకరించే మార్గం. దీనికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా భారతీయ టెకీలు- మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ఐటీ నిపుణులు దీని కోసం పరిగాపులు కాస్తూ ఉంటారు...

హెచ్‌1 బీ వీసా రిజెక్ట్ అవ్వడానికి 3 ముఖ్యమైన కారణాలు ఇవే..! అందుకే మనవాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతున్నారు.!-The Main 3 Reasons For H-1 B Visa Rejection

అయితే ట్రంప్ వచ్చిన తర్వాత ఈ వీసా రావడం చాలా ఇబ్బందిగా మారింది. అమెరికన్ల ఉద్యోగాలకు గండి కొడుతూ అమెరికన్ కంపెనీలు తక్కువ జీతానికి విదేశాల నుంచి ఉద్యోగులను తీసుకొస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షడు ట్రంప్ ఎన్నో సార్లు ఆరోపణలు చేశారు. అంతేకాకుండా కంపెనీలు హెచ్1-బీ వీసాను దుర్వినియోగం చేస్తున్నాయంటూ ఆయన మండిపడ్డారు.

2018లో ఈ వీసా కోసం దరఖాస్తు చేసిన వారి సంఖ్య తొలి రెండు వారాల్లోనే 65 వేల పరిమితిని దాటిందంటే దీనికున్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. పెద్ద కంపెనీలైన ఆపిల్, గూగుల్, ఫేస్‌బుక్ వంటి కంపెనీలకు వీసాలు వస్తున్నప్పటికీ.

మిగతా కంపెనీలు దరఖాస్తు చేసుకున్న వీసాలను మాత్రం యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే వీసా జారీ చేస్తున్నారు..

అయితే వీసా ఆలస్యం లేదా నిరాకరణకు గల ముఖ్య కారణాలను కూడా అధికారులు తెలిపారు.అవేంటో ఒక లుక్ వేసుకోండి.

..

1. వీసా అభ్యర్థించిన కాలవ్యవధిలో ఉద్యోగికి ఆఫ్‌సైట్ వర్క్‌ను కంపెనీ కల్పిస్తుందా అన్న దానిపై కంపెనీల నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడం.

2. వీసా దరఖాస్తుదారునికి, కంపెనీకి మధ్య ఉన్న సంబంధాన్ని నిరూపించడంలో అనేక కంపెనీలు వైఫల్యం చెందడం.

3. వీసా దరఖాస్తుదారుల డిగ్రీకు, పనిచేస్తున్న ఉద్యోగానికి వ్యత్యాసం ఉండటం.