ఆంగ్ల భాషలోని ఐదు లాంగెస్ట్ వ‌ర్డ్స్ గురించి మీకు తెలుసా?... చూస్తే కంగుతింటారు!

ఆంగ్ల భాష ఉచ్చారణలో మనం పొరపాటు ప‌డే పదాలు చాలానే ఉన్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో అత్య‌ధిక అక్షరాలున్న ఇంగ్లీషు పదాన్ని ఉచ్చరించమని అడిగితే మీ స్పందన ఎలా ఉంటుంది? ఎవ‌రైనా నీళ్లు న‌మ‌లాల్సిందే.అలాంటి ఓ ఐదు ఇంగ్లీషు లాంగెస్ట్ వ‌ర్డ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.LOPADOTEMACHOSELACHOGALEOKRANIOLEIPSAN PTERYGON

ఈ గ్రీకు పదంలో మొత్తం 171 అక్షరాలు ఉన్నాయి.ఆంగ్లంలోకి అనువదించిన తర్వాత, దాని మొత్తం పొడవు 183 అక్షరాలు.
అర్థం: అరిస్టోఫేన్స్ తన కామెడీలో ఈ పదాన్ని కల్పిత వంటకం పేరుగా పేర్కొన్నాడు.అరిస్టోఫేన్స్ పురాతన ఏథెన్స్‌కు చెందిన‌ హాస్య రచయిత.

2.PNEUMONOULTRAMICROSCOPICSILICOVOLCANOCONIOSIS

ఇది మొత్తం 45 అక్షరాల పదం.ఇది నిఘంటువులలో కనుగొన్న‌ అతి పొడవైన పదం.
అర్థం: ఇది ఒక రకమైన ఊపిరితిత్తుల వ్యాధి. ఊపిరితిత్తులలోకి అతి సూక్ష్మమైన ధూళి చేరినప్పుడు, ఈ వ్యాధి వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

3.PARASTRATIOSPHECOMYIA STRATIOSPHECOMYIOIDES

Telugu Engish, Language, Longest English, Longest Word, Longestword, Longest-Lat

నిఘంటువులో కనిపించే పొడవైన పదాలలో ఈ పదం కూడా ఒకటి.ఇందులో మొత్తం 42 అక్షరాలు ఉన్నాయి.
అర్థం: ఇది థాయ్‌లాండ్‌లో కనిపించే ఈగ పేరు.ఈ పదం గ్రీకు భాష నుండి కూడా వచ్చింది.ఈ ఫ్లై యొక్క జీవిత కాలం 5 నుండి 8 రోజులు.

4.PSEUDOPSEUDOHYPOPARATHYROIDISM

ఈ పదంలో మొత్తం 30 అక్షరాలు ఉన్నాయి.ఇది ఒక రకమైన థైరాయిడ్ వ్యాధి.

 Longest Word In English Language Confuse Pronoun Easy Help Dictonary Details, Lo-TeluguStop.com

దీనిని సంక్షిప్త రూపంలో PPHP అని కూడా అంటారు.ఈ వ్యాధి మునుపటి తరం నుండి త‌రువాత త‌రం వ్యక్తికి బదిలీ అవుతుంద‌ని చెబుతారు.

5.FLOCCINAUCINIHILIPILIFICATION

Telugu Engish, Language, Longest English, Longest Word, Longestword, Longest-Lat

నాన్ టెక్నికల్ విభాగంలో ఇది పొడవైన పదంగా పరిగణిస్తారు.ఆగస్టు 2019లో జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరిమితి పాలసీ సమావేశంలో కూడా ఈ పదం ప్రస్తావ‌న వ‌చ్చింది.అప్పటి ఎంపీసీ సభ్యుడు చేతన్ ఘాటే ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడేటప్పుడు ఈ పదాన్ని ఉపయోగించారు.

అర్థం: ఈ పదాన్ని విలువ లేని వస్తువుగా భావించే అలవాటుకు సంబంధించిన‌దిగా ఉపయోగిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube