తెలంగాణ బీజేపీ నాలుగో విడత అభ్యర్థుల జాబితా ఇవాళ సాయంత్రం విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.పొత్తులో భాగంగా జనసేనకు తొమ్మిది సీట్లను ఇవ్వాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో జనసేనకు ఇచ్చే స్థానాలను మినహాయించి మిగతా స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ఎంపిక చేసింది.ఇప్పటికే మొత్తం 88 స్థానాలకు మూడు జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించింది.
ఈ నేపథ్యంలో సాయంత్రంలోపు నాలుగో విడత అభ్యర్థుల లిస్టును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.