బిగ్ బాస్ తెలుగులో ఇప్పటి వరకు విన్నర్స్ గా నిలిచిన వారెవరో తెలుసా?

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ హాలీవుడ్ లో మొదలై టాలీవుడ్ వరకు చేరుకుంది.మన ఇండియాలో ముందుగా హిందీలో ఈ షో స్టార్ట్ అయ్యింది.

 List Of Bigg Boss Telugu Winners Details, Abijit, Bigg Boss 5 Telugu, Biggboss 5-TeluguStop.com

ఇక్కడ ఘన విజయం అవ్వడంతో ఇక అక్కడి నుండి అన్ని భాషల్లో ఈ షో ను స్టార్ట్ చేసారు.స్టార్ట్ అయిన అన్ని భాషల్లో ఈ షో మంచి విజయం సాధిస్తూ వస్తుంది.

ఇప్పటి వరకు మన ఇండియన్ ప్రజలకు తెలియని ఒక కొత్త షోను పరిచయం చేసింది బిగ్ బాస్.

తాజాగా మన తెలుగులో బిగ్ బాస్ నాలుగు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని ఇప్పుడు ఐదవ సీజన్ ను కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది.

నిన్న ఆదివారం బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అట్టహాసంగా జరిగింది.ఈ సీజన్ లో సన్నీ కప్ అందుకుని అందరిని  ఆశ్చర్య పరిచాడు.

బిగ్ బాస్ హౌస్ లోకి ఒక సాధారణ వ్యక్తిగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుని విన్నర్ గా నిలిచాడు.ఇదిలా ఉంటే ఇప్పటి వరకు జరిగిన 4 సీజన్స్ లో ఎవరు విన్ అయ్యారో, ప్రైజ్ మనీ ఎంత గెలుచుకున్నారో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు ఫస్ట్ సీజన్ :

Telugu Abijit, Bigg Boss, Bigg Boss Sunny, Biggboss, Biggboss Telugu, Kaushal Ma

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు 2017 డిసెంబర్ 24న స్టార్ట్ అయినా బిగ్ బాస్ సీజన్ వన్ ఒక కొత్త అనుభూతిని పరిచయం చేసింది.ఈ షో గురించి హిందీ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నప్పటికీ తెలుగులో షో చూసే సరికి కొత్త ఎ క్స్ పిరియన్స్  అందుకున్నారు.మొదటి సీజన్ కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించి సూపర్ అనిపించాడు.మొదటి సీజన్ లో శివ బాలాజీ విన్నర్ గా నిలిచి 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు.

బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్ :

Telugu Abijit, Bigg Boss, Bigg Boss Sunny, Biggboss, Biggboss Telugu, Kaushal Ma

బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్ కు నాని వ్యాఖ్యాతగా వ్యవహరించగా కౌశల్ మందా బిగ్ బాస్ టైటిల్ గెలుచుకుని 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందుకున్నాడు.బిగ్ బాస్ సెకండ్ సీజన్ 2018 సెప్టెంబర్ లో స్టార్ట్ అయ్యింది.ఈ సీజన్ ద్వారా కౌశల్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించు కున్నాడు.

బిగ్ బాస్ తెలుగు థర్డ్ సీజన్ :

Telugu Abijit, Bigg Boss, Bigg Boss Sunny, Biggboss, Biggboss Telugu, Kaushal Ma

బిగ్ బాస్ థర్డ్ సీజన్ కు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించగా విన్నర్ గా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు.ఈ సీజన్ 2019 నవంబర్ 3న స్టార్ అయ్యింది.ఈ సీజన్ లో రాహుల్ విన్నర్ టైటిల్ తో పాటు 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు.బిగ్ బాస్ వల్ల బాగా ఫేమస్ అయిన రాహుల్ ఇప్పడు సింగర్ గా మంచి మంచి అవకాశాలు అందుకుంటూ కేరీర్ లో దూసుకు పోతున్నాడు.

బిగ్ బాస్ తెలుగు ఫోర్త్ సీజన్ :

Telugu Abijit, Bigg Boss, Bigg Boss Sunny, Biggboss, Biggboss Telugu, Kaushal Ma

బిగ్ బాస్ తెలుగు ఫోర్త్ సీజన్ లో కూడా నాగార్జున వరుసగా రెండవ సారి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.2020 సెప్టెంబర్ 6న జరిగిన ఈ సీజన్ లో అభిజిత్ విన్నర్ గా నిలిచి 50 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు.ఇప్పుడు సీజన్ 5 లో సన్నీ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

అయితే ఇతడు 50 లక్షల ప్రైజ్ మనీ తో పాటు ప్లాట్ కూడా గిఫ్ట్ గా అందుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube