మాంసం కోసం మొసలితో భీకర పోరుకు దిగిన సింహం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో మీకోసం..

వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌లు ధైర్యం చేసి అడవిలోకి వెళ్లి అక్కడ జరిగే అద్భుతమైన, భయంకరమైన దృశ్యాలను వీడియోలు తీస్తుంటారు.అయితే వీరి కెమెరాల్లో ఒక్కోసారి ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు కూడా రికార్డు అవుతుంటాయి.

 The Lion Who Got Into A Fierce Fight With The Crocodile For Meat The Tear-jerk-TeluguStop.com

వీటిని ఎప్పటికప్పుడు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌లు ప్రపంచంతో పంచుకుంటారు.తాజాగా వాళ్లు షేర్ చేసిన ఒక షాకింగ్ వీడియోను ‘nature27_12’ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.1 నిమిషం 11 సెకన్ల పాటు సాగిన ఈ వీడియో లో ఒక సింహం, మొసలి భీకర పోరుకు దిగాయి.ఈ రెండు కౄర మృగాలు కూడా అతి పెద్దగా ఉండటంతో వాటి మధ్య జరిగిన పోట్లాట ఇప్పుడు అందరికీ ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది.

ఇప్పటికే వైరల్ గా మారిన ఈ వీడియోకి పదివేలకు పైగా వ్యూస్ వచ్చాయి.దీనిపై నెటిజన్లు రక రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో జింకను ఒక సింహం చంపేసినట్లు కనిపిస్తోంది.అయితే ఈ జింక మాంసాన్ని మొసలి సింహం నుంచి చోరీ చేసినట్లుగా కనిపించింది.

ఆ మొసలి నీటిలోకి జంప్ చేసి జింక మాంసాన్ని తినడానికి ప్రయత్నిస్తుండగా దాన్నుంచి మాంసాన్ని లాక్కోవడానికి సింహం ప్రయత్నించింది.ఈ క్రమంలో ఈ రెండు జంతువుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది.

సింహం జింక శరీరాన్ని గట్టిగా తన పళ్లతో పట్టుకోగా.మొసలి కూడా అదే స్థాయిలో మాంసాన్ని గట్టిగా లాగేసింది.

చివరికి సింహం బలం ముందు మొసలి తలోగ్గింది.దాంతో జింక మాంసం నీటి నుంచి నేల మీదకి తీసుకు రాగలిగింది సింహం.

అప్పటికీ మొసలి మాంసాన్ని వదిలి పెట్టలేదు.ఆ విధంగా ఈ రెండు కూడా చాలాసేపు తీవ్రంగా పోరాడాయి.

చివరికి ఇవి జింకను వదిలిపెట్టకుండా షేర్ చేసుకున్నట్లు కనిపించింది.

అయితే సాధారణంగా మొసలి, సింహం మధ్య వైరం ఉంటుంది.

ఇవి రెండూ ఒకదానికి ఒకటి చంపుకొని తినగలవు.కానీ ఇక్కడ మాత్రం రెండూ స్నేహం చేస్తున్నట్లుగా కనిపించాయి.

జింక మాంసం దక్కించుకోవడంలో ఇవి పోట్లాడాయే తప్ప ఒక దానిపై ఒకటి దాడి చేసు కోలేదు.అయితే వీటి పోట్లాట మాత్రం అందరికీ షాక్ ఇస్తోంది.

దీన్ని నెటిజన్లు ఇది చాలా భయంకరంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube