జిరాఫీ పిల్ల‌ను వేటాడిన సింహం.. కానీ చివ‌ర‌కు సీన్ రివ‌ర్స్‌

The Lion That Hunted The Giraffe Cub But In The End Seen Reversed

అడ‌విలో ఎప్పుడూ అల‌జ‌డిగానే ఉంటుంది.అక్క‌డ ఎవ‌రి ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ‌రికీ తెలియ‌దు.

 The Lion That Hunted The Giraffe Cub But In The End Seen Reversed-TeluguStop.com

అక్క‌డ బ‌తికి బ‌ట్ట క‌ట్టాలంటే ప్ర‌తి క్ష‌ణం యుద్ధ వాతావ‌ర‌ణ‌మే అనిచెప్పొచ్చు.ఏ జంతువుకు ఏ ప్రాణి ఆహారంగా మారుతుందో చెప్ప‌డం చాలా క‌ష్టం.

అక్క‌డ ఒక‌రి ప్రాణమే మ‌రొక‌రి ఆహారం.అక్క‌డ ఒక ప్రాణి బ‌త‌కాలంటే మ‌రోప్రాణి ప్రాణాలు కోల్పోవాల్సిందే.

 The Lion That Hunted The Giraffe Cub But In The End Seen Reversed-జిరాఫీ పిల్ల‌ను వేటాడిన సింహం.. కానీ చివ‌ర‌కు సీన్ రివ‌ర్స్‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా నిత్యం చావు, బ‌తుకుల సంహార‌మే అడ‌వి.అందుకే అక్క‌డ జ‌రిగే ప్ర‌తి సంఘ‌ట‌న ఎంతో ఆక‌ట్టుకుంటుంది.

ఇప్పుడు వేట‌కు సంబంధించిన వీడియోలకు ఎంత పాపుల‌ర్ క్రేజ్ ఉందో తెలిసిందే.

సోష‌ల్ మీడియా వ‌చ్చిన మొద‌టి నుంచి ఈ త‌ర‌హా వీడియోల‌కు విప‌రీత‌మైన క్రేజ్ ల‌భిస్తోంది.

ముఖ్యంగా క్రూర మృగాలు అయిన సింహం, పులి, లేదా ఇత‌ర మాంసాహార జంతువుల‌కు స‌బంధించిన వీడియోలు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతుంటాయి.ఇప్పుడు కూడా ఓ సింహానికి సంబంధించిన వేట వీడియో వైర‌ల్ అవుతోంది.

అయితే ఇది కొంచెం డిఫ‌రెంట్ గా ఉంది.నిజానికి క్రూర జంతువుల వేట‌లు కూడా కొన్ని సార్లు బెడిసికొడుతుంటాయి.

ఇప్పుడు ఈ సింహం విష‌యంలో కూడా ఇలాగే జ‌రిగింది.ఓ ఆడ సింహం జిరాఫీ పిల్ల‌ను వేటాడ‌బోయింది.

గుంపు మీద ఆ ఆడ‌సింహం వేట సాగించ‌బోతే చివ‌ర‌కు జిరాఫీ పిల్ల చిక్కింది.ఇంకేముంది హాయిగా దాన్నితినేద్దామ‌ని అనుకుంది.కానీ ఇంత‌లోనే అక్క‌డ‌కు త‌ల్లి జిరాఫీ ప‌రుగున వ‌చ్చేసింది.ఇక సింహం బారి నుంచి పిల్ల‌ను విడిపించుకుని పరిగెత్తే క్ర‌మంలో రెండూ వేర్వేరు అయ్యాయి.ఇక దీన్ని ఆస‌రాగా చేసుకుని పిల్ల వెంట ప‌డింది ఆడ సింహం.ఇక ఆ జిరాఫీ పిల్ల నదిలోకి దిగింది.

సింహం అందులోకి వెళ్ల‌లేక‌పోయింది.దాదాపు 7 గంటల పాటు నీటిలోనే ఉండ‌గా.

చివ‌ర‌కు అందులోనే మునిగి చనిపోయింది.ఇందుకు సంబంధించిన వీడియో అంద‌రినీ కంట‌త‌డి పెట్టిస్తోంది.

.

#Animals #Animals #Girafee #Giraffe Cub #Giraffee Cub

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube