ఆవు గొంతును నోట కరచుకున్న సింహం.. అది చూసిన రైతు ఏం చేశాడంటే..

అత్యంత క్రూరమైన సింహాలు( lions ) ఆవులను అధికంగా వేటాడుతుంటాయి.మన ఇండియాలో అడవుల నరికివేత ఎక్కువ కావడం వల్ల సింహాలు జనావాసాల్లోకి కూడా వస్తున్నాయి.

 The Lion Biting The Cow's Throat What Did The Farmer Do When He Saw It, Lioness,-TeluguStop.com

ఆపై పెంపుడు ఆవులపై దాడి చేస్తూ వాటిని తినేస్తున్నాయి.ఇటీవల కూడా ఒక ఆడ సింహం ఆవు మెడను అదును చూసి నోట కరచుకుంది.

దాన్ని చంపేసి తినేయాలని అనుకుంది.అయితే ఆ ఆవు యజమాని, రైతు అయిన కీర్తి సింగ్ చౌహన్( Kirti Singh Chauhan ) అటువైపుగా వచ్చి ఈ షాకింగ్ దృశ్యం చూశారు.

తన ఆవు చావు బతుకుల మధ్య కొట్లాడుతున్న పరిస్థితిని చూసి చలించి పోయారు.

సింహాన్ని చూసి పారిపోకుండా ధైర్యంగా ముందుకు అడుగులు వేశారు.అంతేకాదు, బిగ్గరగా అరుస్తూ ఆ సింహాన్ని భయపెడుతూ రాయి విసిశారు.దాంతో భయపడిన సదరు సింహం ఆవుని విడిచి పెట్టి పొదల్లోకి పారిపోయింది.

ఆవును ఆ సింహం నోటితో బలంగా కొరికింది కాబట్టి దానికి బాగానే గాయాలైనట్టు తెలుస్తోంది.అయినా ఆ ఆవు నేల కూలకుండా తన కాళ్లపై తాను నిల్చోని బాగానే తిరుగుతూ కనిపించింది.

గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ ( Gir Somnath in Gujarat )జిల్లాలో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.ఒక రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.అదే రోడ్డుపై కారులో వెళ్తున్న ఒక వ్యక్తి ఈ దృశ్యాలను తన కెమెరాలో బంధించారు.ఆ వీడియోను జునాగఢ్‌లోని కేషోడ్ కార్పొరేటర్ వివేక్ కొటాడియా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దీన్ని చూసిన నెటిజన్లు ఆ రైతు ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.తన పశువును ధైర్యం చేసి కాపాడిన ఆ రైతుకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube