అప్పటిలోగా 180 ఏళ్లు కానున్న మనిషి ఆయుష్షు.. అబ్బురపరిచే నిజాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు..!

The Life Span Of A Man Who Will Be 180 Years Old By Then Scientists Who Have Revealed Dazzling Facts

మనుషుల ఆయుర్ధాయం గరిష్ఠంగా వందేళ్లు అని చెబుతున్నారు కానీ ఈ రోజుల్లో 100 సంవత్సరాల పాటు బతికే వాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు.ఇందుకు ప్రధాన కారణం మధ్య వయస్సులోనే చాలా మంది రోగాల బారిన పడటమే.

 The Life Span Of A Man Who Will Be 180 Years Old By Then Scientists Who Have Revealed Dazzling Facts-TeluguStop.com

అయితే ఎలాంటి అనారోగ్యాలు లేనివారు కూడా వందేళ్ల తర్వాత శరీరంలోని అన్ని అవయవాలు క్షీణించడంతో చనిపోతున్నారు.ఈ వంద సంవత్సరాల్లో మనిషి మెదడు, గుండె.

ఇలా అన్ని అవయవాలు పూర్తిగా పనిచేయడం మానేస్తాయని సైంటిస్టులు చాలా ఏళ్ల క్రితమే కనుగొన్నారు.అయితే తాజాగా హెచ్ఈసీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మనిషి ఆయుష్షు గురించి అబ్బురపరిచే నిజాలను బయటపెట్టారు.2100వ సంవత్సరంలోగా మనుషుల ఆయుష్షు 100 నుంచి 180 ఏళ్లవరకు పెరుగుతుందని ఈ శాస్త్రవేత్తలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.దీనితో నిజంగానే త్వరలో మనుషులు 180 ఏళ్లు బతుకుతారా? అని ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు.

 The Life Span Of A Man Who Will Be 180 Years Old By Then Scientists Who Have Revealed Dazzling Facts-అప్పటిలోగా 180 ఏళ్లు కానున్న మనిషి ఆయుష్షు.. అబ్బురపరిచే నిజాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కెనడాలోని మాంట్రియల్‌లోని హెచ్ఈసీ యూనివర్సిటీ పరిశోధకులు, శాస్త్రవేత్తల బృందం ఈ శతాబ్దం చివరి నాటికి మానవులు 180 ఏళ్ల వరకు బతుకుతారని తమ పరిశోధన ఆధారంగా చెబుతున్నారు.శాస్త్రవేత్తలు చాలాకాలంగా మనిషి ఆయుష్షు పై పరిశోధన చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే మనిషి జీవిత కాలం గురించి ఆసక్తికర విషయాలు కనుగొన్నారు.2100 నాటికి 180 ఏళ్లు బతికే మనుషులు ఇప్పటి లాంగ్ లివింగ్ రికార్డులను బద్దలు కొడతారని అసిస్టెంట్ ప్రొఫెసర్ లియో బెల్జిల్ తెలిపారు.ఇప్పటివరకు అత్యంత ఎక్కువ కాలం జీవించిన మనిషిగా ఫ్రెంచ్ మహిళ జీన్ కాల్‌మెంట్ రికార్డు సృష్టించింది.ఈమె 1997 కన్నుమూయగా అప్పటికి ఆమె వయసు 122 ఏళ్లు.

Telugu French Jean, Hec-Latest News - Telugu

అయితే మనుషులు ఎక్కువ కాలం నివసించడం వల్ల ఎక్కువగా నష్టాలే వాటిల్లుతాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.ఒక పాత కారును నడపాలంటే ఎలా రిపేర్ ఖర్చులు వెచ్చించాల్సి వస్తుందో.అలా ఒక మనిషి తన వృద్ధాప్య జీవితాన్ని గడపాలంటే మెడికల్ బిల్లులకు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుందని అంటున్నారు.ఏది ఏమైనా ప్రస్తుతం శాస్త్రవేత్తలు చెబుతున్న ఈ మాటలు అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి.

#French Jean #HEC

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube