ప‌వ‌న్‌ను ఇర‌కాటంలో ప‌డేసిన ఆ లేఖ‌.. ముద్ర‌గ‌డ ఎఫెక్ట్‌..

ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌ను తాను అంద‌రి వాడిలా ముద్రించుకునేందుకు చాలానే ప్ర‌య‌త్నించారు.కానీ అది సినిమాల ప‌రంగా ప‌నికొస్తుంది కానీ పాలిటిక్స్ ప‌రంగా అస్స‌లు ప‌నికి రాద‌న్న విష‌యం ఆయ‌న‌కు ఓడిపోయిన త‌ర్వాత చాలా బాగా అర్థం అయింది.

 The Letter That Put Pawan In A Dilemma The Stamp Effect Pawan, Ap Politics-TeluguStop.com

ఎందుకంటే రాజ‌కీయాల్లో వర్గాల వారీగానే ప్ర‌యోజ‌నాలు, ఫ‌లితాలు ఆధార‌ప‌డి ఉంటాయి.దీంతో వ‌ప‌న్ కూడా కొంత యూట‌ర్న్ తీసుకుని త‌న వ‌ర్గాన్ని ఆక‌ట్టుకునే ప‌నిలో ప‌డ్డారు.

ఏపీలో అత్యంత బ‌ల‌మైన మెజార్టీ వ‌ర్గంగా ఉన్న కాపు సామాజిక వ‌ర్గాన్ని ఆక‌ట్టుకునేంద‌కు ప‌వ‌న్ తెగ ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఆయ‌న‌కు ఓ లేఖ చిక్కులు తెచ్చి పెడుతోంది.

కాపుల పెద్ద దిక్కుగా ఉన్న ముద్రగడ పద్మనాభం అంటే ఏపీలోని కాపులు అత్య‌ధిక ప్రాముఖ్య‌త ఇస్తారు.ఎందుకంటే ముద్ర‌గ‌డ ఎన్నో ఏండ్ల నుంచి కాపుల రిజ‌ర్వేష‌న్ల కోసం, వారి హ‌క్కుల కోసం పోరాడుతున్నారు.అన్ని రాజ‌కీయ పార్టీల‌ను నిల‌దీసే నిజ‌మైన కాపుగా ఆయ‌న‌కు పేరుంది.1993లో కూడా కాపు రిజ‌ర్వేష‌న్ల పేరిట మొద‌ట ఉద్యమం ప్రారంభించింది ఆయ‌నే.అయితే 2014 ఎన్నికల స‌మ‌యంలో చంద్రబాబు నాయుడు తాము కాపులకు బీసీ రిజర్వేషన్లు అమ‌లు అయ్యే విధంగా చూస్తామ‌ని చెప్పి వారిని ఆక‌ట్టుకున్నారు.

Telugu Ap, Janasena, Kaapu Vargam, Mudragada, Pawan, Letterput, Ysrcp-Telugu Pol

అయితే అధికారంలోకి వచ్చిన త‌ర్వాత ఆయ‌న ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ముద్రగడ ఆయ‌న్ను నిద్రపోనీయకుండా వెంటాడారు.దీంతో చంద్ర‌బాబు అనుచరులు ముద్ర‌గ‌డ‌ను ఇబ్బందులు పెట్టార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.ఆయ‌న మీద అణచివేత చర్యలు కూడా తీసుకున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

ఇక వాటిని గుర్తు చేస్తూ ముద్ర‌గ‌డ ఇప్పుడు లేఖ రాశారు.చంద్ర‌బాబు మొన్న క‌న్నీళ్లు పెట్టుకున్న ఘ‌ట‌న మీద బ‌హిరంగంగా లేఖ రాశారు.

త‌న‌ను కూడా ఇలాగే ఇబ్బందులు పెట్టార‌ని, అప్పుడు మీకు జాలి ద‌య లేవా అంటూ ప్ర‌శ్నించారు.దీంతో ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇస్తే ఆయ‌న‌కు కాపులు వ్య‌తిరేకం అవుతార‌నే టెన్ష‌న్ ప‌ట్టుకుంది.

టీడీపీకి స‌పోర్టుగా ఉంటే కాపుల వ్య‌తిరేకిగా ముద్ర‌ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని జ‌న‌సేన అధినేత ఆలోచ‌న‌లో పడ్డారంట‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube